Winter Tips:చలికాలంలో దగ్గు, జలుబు ఎంతకీ తగ్గడం లేదా.. ఈ చిట్కాలతో వెంటనే రిలీఫ్ పొందండి!
Winter Tips:చలికాలంలో దగ్గు, జలుబు ఎంతకీ తగ్గడం లేదా.. ఈ చిట్కాలతో వెంటనే రిలీఫ్ పొందండి. సీజన్ మారుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి.
చలికాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. పైగా ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దీనివల్ల ఏ పని మీద ఫోకస్ చేయలేం. ఇంగ్లీష్ మందులు వాడినా కూడా ఇవి అంత తొందరగా తగ్గవు. దీర్ఘకాలం వేధిస్తూనే ఉంటాయి. కాకపోతే వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం
నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగడం వల్ల జలుబును తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో జలుబు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.
నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి.
పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.
పుట్టగొడుగులు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్‌ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది.