Beauty Tips

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా.. మిరియాలను కేవలం ఆహార పదార్థాల్లో మాత్రమే కాకుండా సుగంధ ద్రవ్యాల్లోను, ఔషధాల్లోను ఉపయోగిస్తుంటారు. అందులో ఎక్కువగా ఆయుర్వేద ఔషధంగా మిరియాలు చాలా పనిచేస్తాయి.

మిరియాల్లో ఉండే క్యాప్సైసిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మిరియాలతో ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాదారణంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చర్మం కావాలని కోరుకుంటారు. మార్కెట్ లో అనేక రకాల ఉత్పత్తులను కొని విసిగిపోయి ఉంటారు. వాటికి బదులుగా మన వంటగదిలో ఉండే ఉత్తమ మరియు అత్యంత సహజమైన పదార్ధాలను ప్రయత్నించవచ్చు. ఏ మసాలా దినుసుకి లేని చర్మ ప్రయోజనాలు నల్ల మిరియాలకు ఉన్నాయి.
Black pepper Benefits In telugu
బొల్లిని నయం చేస్తుంది
బొల్లి అనేది చర్మంలో కొంత ప్రాంతంలో పిగ్మెంటేషన్ కోల్పోవడం వలన కలిగే చర్మ పరిస్థితి. చర్మం దాని సహజ రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. ఈ చర్మ వ్యాధి కోసం అనేక చికిత్సలు ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువగా కఠినమైన రసాయనాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చాలామంది రోగులు బొల్లి నివారణకు నల్ల మిరియాలను వాడుతున్నారు.

లండన్ లో జరిగిన ఒక పరిశోదనలో, నల్ల మిరియాలలో ఉండే పిపెరినే అనేది చర్మంలో వర్ణద్రవ్యం యొక్క ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ఇది రసాయన ఆధారిత చికిత్సలకు సహజ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

ముడతలను తగ్గిస్తుంది
నల్ల మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్,ముడతలు,నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.
Young Look In Telugu
ఎక్స్ ఫ్లోట్
నల్ల మిరియాలను పొడి చేసి స్క్రబ్ గా ఉపయోగించాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం ఎక్స్ ఫ్లోట్ అయ్యి చనిపోయిన చర్మం కణాలు తొలగించబడతాయి. చర్మం నుండి విషాన్ని తొలగించటానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణను పెంచటం ద్వారా చర్మంనకు మరింత ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. నల్ల మిరియాల్లో ఉన్న శోథ నిరోధక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నిరోదిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ