Beauty Tips

White teeth:దంతాలపై గార పట్టిందా..ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే డెంటిస్ట్ అవసరం లేదు..

White teeth:దంతాలపై గార పట్టిందా..ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే డెంటిస్ట్ అవసరం లేదు.. ప్రస్తుతం దంతాల్లో గార సమస్య తెరపైకి వస్తోంది. దంతాలలో బ్యాక్టీరియా చేరడం వల్ల, ఒక అంటుకునే పొర పేరుకుపోతుంది, అప్పుడు దానిని గార లేదా గార అంటారు

ఈ మధ్య కాలంలో చాలా మంది దంతాల పట్ల శ్రద్ద పెట్టటం లేదు. ఏదో పళ్ళు త్వరత్వరగా తోముకొని పనుల్లో పడుతూ ఉంటారు. దాంతో పళ్లపై పాచి పెరగటమే కాకుండా పసుపు రంగులోకి మారతాయి. ఇలా పసుపు రంగులోకి మారిన దంతాలు తెల్లగా మెరవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఖరీదైన క్రీమ్ లు వాడవలసిన అవసరం లేదు.
White teeth tips
దంతాలు తెల్లగా మెరవటానికి ఒక పొడిని తయారుచేసుకుందాం. ఒక టీస్పూన్ రాక్ ఉప్పు, ఒక టీస్పూన్ లవంగం పొడి, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ అతి మధురం పొడి, 15 ఎండిన వేప ఆకులు మరియు 15 ఎండిన పుదీనా ఆకులు సరిపోతాయి. వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.

ఈ పొడిని గాలి తగలకుండా ఓ డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఒక స్పూన్ పొడిని అరచేతిలో వేసుకుని, బ్రష్‌ని ఉపయోగించి దంతాలను పౌడర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే దంతాల మీద పాచి,పసుపు రంగు అన్నీ తొలగిపోతాయి. ఎక్కువసేపు లేదా చాలా గట్టిగా బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఇది పంటిని కప్పి ఉంచే బయటి కవరింగ్‌ను తొలగించే ప్రమాదం కూడా ఉంది.

ఎప్పుడైనా ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో దంతాలు శుభ్రం అవ్వటమే కాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండి చిగుళ్ళ సమస్యలు ఏమి లేకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ