Pudina Rice:లంచ్ బాక్స్ లోకి చిటికెలో చేసుకొనే పుదీనా పులావ్
Pudina Rice:లంచ్ బాక్స్ లోకి చిటికెలో చేసుకొనే పుదీనా పులావ్.. పుదీనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనా వాసన కారణంగా మనలో చాలా మంది తినటానికి ఇష్టపడరు. ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు.
వారంలో ఒక రోజు పలావు చేసుకుంటే, రొటీన్ కు కాస్త భిన్నంగా అనిపిస్తుంది. వెజిటేబుల్ రైస్, బగారా రైస్, టమాటా రైస్, ఇవన్ని మనం రెగ్యూలర్ గా చేసుకునే వెజ్ పలావ్స్. అంతే టేస్టీగా చాలా ఈజీగా, తయారు చేసుకునే, పూదీనా రైస్ కూడా ఒకసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
నూనె – 2 టీ స్పూన్స్
నెయ్యి – 1 టీ స్పూన్
బగారా ఆకు – 1
దాల్చిన చెక్క – 1 ఇంచ్
లవంగాలు – 5
యాలకులు – 4
ఉల్లిపాయ తురుము -1
పచ్చిమిర్చి – 5
గరం మసాలా -1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పుదీనా పేస్ట్ – 3 స్పూన్స్
నిమ్మరసం – 1 టీ స్పూన్
వండిన అన్నం – 110 గ్రాములు
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులోకి నూనె మరియు నెయ్యి వేసి, అందులోకి మసాలా దినుసులను వేసుకోవాలి.
2. అవి వేగిన తర్వాత, తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి , వేసుకుని, లో ఫ్లేమ్ లో ఎర్రగా వేయించుకోవాలి.
3. వేగిన ఉల్లిపాయల్లో, ఉప్ప, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుని, ఒక నిముషం పాటు వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందులోకి, పుదీనా పేస్ట్ వేసి, నూనె పైకి తెలేవరకు ఫ్రై చేసుకోవాలి.
5. ఫ్రై అయిన పుదీనా పేస్ట్ లోకి, ఉడికించిన అన్నం వేసి, బాగా కలిసేలా, కలుపుకుని, స్టవ్ ఆఫ్ చేసి , నిమ్మకాయ రసం చల్లుకుని, సెర్వ్ చేసుకుంటే పుదీనా రైస్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News