Saggubiyyam Murukulu:ఈ పండుగ కి సగ్గుబియ్యం తో జంతికలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి
Saggubiyyam Murukulu:ఈ పండుగ కి సగ్గుబియ్యం తో జంతికలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి. saggubiyyamతో చేయటం వలన చాలా గుల్లగా వస్తాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.
రెండు వారాలకు సరిపడా, స్నాక్స్ ఒకేసారి చేసిపెట్టుకుంటే, ఈవినింగ్ టైమ్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలు, పెద్దలు, ఎంతో ఎంజాయ్ చేస్తూ తినే, మురుకులను, కొంచం వెరైటీగా చేసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
బియ్యం పిండ – 3 కప్పులు
ఉప్పు – తగినంత
ఇంగువ – 1/4టీ స్పూన్
అల్లం – పచ్చిమిర్చి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 స్పూన్
మజ్జిగ – తగినంత
నిమ్మరసం – సగం నిమ్మకాయ
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసుకుని, తగినన్ని నీళ్లు పోసి, నాలుగు గంటలు నానపెట్టండి.
2.ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి బియ్యం పిండిని వేసి, అందులోకి గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ , ఉప్పు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి, మజ్జిగ వేస్తూ, ముద్దలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు మురుగు మేకర్ లో లోపలి వైపు ఆయిల్ వేసి , పిండిని అందులోకి నింపాలి.
5.ఇప్పుడు గరిటెపైన, లేదా అరటి ఆకు పైన నూనె రాసి, గుండ్రని చుట్టలుగా చుట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ బాండీ పెట్టి, అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత, తయారు చేసుకున్న మురుకులను వేసి వేయాలి.
7. ఇప్పుడు ఒక నిముషం పాటు అటూ ఇటూ తిప్పుకుని మురుకులను బయటికి తీయాలి.
8. అంతే సగ్గుబియ్యం మురుకులు రెడీ..
Click Here To Follow Chaipakodi On Google News