Beauty Tips

Dandruff And Hair Loss : ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు, చుండ్రు సమస్య దరిచేరదు..

Dandruff And Hair Loss : ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు, చుండ్రు సమస్య దరిచేరదు.. ప్రస్తుతం చాలా మంది చుండ్రు, జట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు.

అయితే ఈ సమస్యలను అధిగమించడానికి మార్కెట్లో లభించే రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. అయితే అలా కాకుండా సహజ పద్ధతుల ద్వారా కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ చుండ్రు, బట్టతల సమస్య దరిచేరకుండా ఉండాలంటే పాటించాల్సిన సహజ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం. ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
usiri benefits in telugu
ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయలను తురుముకుని వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకు., గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు, 100 గ్రాముల మెంతులు, రెండు స్పూన్ల kalonji seeds, గుప్పెడు గుంటగలగరాకు, గుప్పెడు కరివేపాకు వేసి దానిలో అరకేజీ కొబ్బరి నూనె వేయాలి.

ఇప్పుడు పొయ్యిమీద పెట్టి తక్కువ మంటలో పదార్థాలన్నీ కలుపుతూ నల్లగా మారే అంతవరకు నూనెను మరిగించుకోవాలి. ఈ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ తలకు రాసుకుంటూ రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తల మీద చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ