Cockroaches Remedies: రూపాయి ఖర్చు లేకుండా బొద్దింకల బెడద తప్పాలంటే..ఇలా చేస్తే సరి
Cockroaches home Remedies: ఇంటిలో బొద్దింకలు కనపడితే చాలా ఇబ్బందిగా మరియు వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక నానా బాధలు పడుతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన వాటిని తరమలేక విసుగు వచ్చేస్తుంది. ముఖ్యంగా వంటగది, బీరువాల్లో అయితే బొద్దింకలు పిల్లలతో తిరిగేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలతో బొద్దింకలకు చాలా సులభంగా చెక్ పెట్టవచ్చు.
బేకింగ్ సోడా బొద్దింకలను వదిలించుకోవడానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో పంచదార కలిపి బొద్దింకలు ఉండే ప్రదేశంలో చల్లాలి. అప్పుడు బొద్దింకలు పారిపోతాయి.
బిర్యానీ ఆకు కూడా బొద్దింకలను తరిమి కొట్టటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మనం సాదారణంగా బిర్యానీ ఆకును మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం. బిర్యానీ ఆకును నీటిలో వేసి నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని వడకట్టి బొద్దింకలు ఉండే ప్రదేశంలో చల్లాలి. అప్పుడు బొద్దింకలు పారిపోతాయి.
నిమ్మకాయ, బేకింగ్ సోడాను నీటిలో కలిపి బొద్దింకలపై కూడా చల్లవచ్చు. నిమ్మకాయ, బేకింగ్ సోడా రెండు కూడా బొద్దింకలను తరిమి కొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పిన అన్ని చిట్కాలు బొద్దింకలను తరిమికొట్టటంలో సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/