Kitchenvantalu

Rava Vadalu: ఈ వడ.. బెంగళూరు టీ షాప్‌ స్పెషల్.. సూపర్ టేస్ట్ గా ఉంటుంది

Bangalore Style Rava Vada: మినపప్పు,పెసరపప్పు,శనగపప్పు తో వడలు తరచు చేస్తునే ఉంటాం. కాని బొంబాయి రవ్వతో రవ్వ వడలు చేసి చూడండి.రుచి అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయలు – 1 కప్పు
పచ్చిమిర్చి తురుగు- 1 టేబుల్ స్పూన్
అల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్
కరివేపాకు తరుగు – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
నూనె / నెయ్యి – 1 టేబుల్ స్పూన్
పుల్లని పెరుగు – ¼ – 1/3 కప్పు
నూనె – తగినంత

తయారీ విధానం
1.ఉల్లిపాయ చీలికలు మిగిలిన పదార్ధాలన్ని చేతులతో వత్తుతూ కలుపుకోవాలి.
2.ఉల్లిపాయలోంచి నీరు వదిలాక అందులోకి బొంబాయి రవ్వ వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి.
3.తరువాత వేడి నూనె కొద్దిగా వేసి పిండిని బాగా కలుపుకోవాలి.
4.రవ్వని బాగా కలుపుకున్నాక పుల్లని పెరుగు వేసి రవ్వని కాస్త గట్టి ముద్దగానే కలుపుకోవాలి.

5.కలుపుకున్న పిండి అరగంట పాటు నాననివ్వాలి.
6.అరగంట తర్వాత తడి చేత్తో కొద్దిగా పిండి తీసుకోని బటర్ పేపర్ పై లేదా అరటి ఆకు పై పల్చగా వత్తుకోవాలి.
7.వత్తుకున్న వడలను వేడి వేడి నూనెలో వేసి కదిలించకుండా కాసేపు వదిలేయాలి.
8.నిమిషం తర్వాత నెమ్మదిగా తిరగేసుకోని మీడియం ఫ్లేమ్ పై వేపుకోవాలి.
8.వడ ఎర్రగా కాలిన తర్వాత జల్లి గరిట సాయంతో బయిటికి తీసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News