Leo Zodiac Sign:ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు స్వభావంలో మొండివారు. సహాయంలో ముందుంటారు
Leo Zodiac Sign:ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు స్వభావంలో మొండివారు. సహాయంలో ముందుంటారు సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖ నక్షత్రం నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర మొదటి పాదం సింహ రాశి కిందకు వస్తాయి. వీరి స్వభావం గురించి చూస్తే నాయకత్వ లక్షణాలు కనపడతాయి.
వీరికి సహజసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఏ విషయంలోనైనా ముందడుగు వేస్తారు. కానీ వెనకడుగు మాత్రం వేయటానికి అసలు సిద్ధంగా ఉండరు. కొత్త,పాత అనే తేడా లేకుండా అందరితో తొందరగా కలిసిపోతారు. వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఈ రాసివారి అభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం అసలు తట్టుకోలేరు. ఏ నిర్ణయం తీసుకున్న సొంతంగా అలోచించి మాత్రమే
తీసుకుంటారు. ఇతరుల మీద అసలు ఆధారపడరు.
సమాజంలో ఒక గౌరవం,గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా సరే వారి ప్రత్యేకతను చాటుకుంటారు. ఏదైనా లౌక్యంగా ,చాకచక్యంగా చేయటంలో సిద్దహస్తులు. ఈ రాశివారు ముందు చూపుతో పాటు వెనక చూపు కూడా ఉండాలి. ఈ రాశివారు పొగడ్తలకు పడిపోతారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బలం,బలహీనత.
లక్షణాల పరంగా చూసుకుంటే ఈ రాశి స్థిర రాశి. అందువల్ల ఈ రాశివారు ఏ నిర్ణయం తీసుకున్న చాలా స్థిరంగా తీసుకోవటమే కాకుండా అలాగే అమలు పరుస్తారు. తమ నిర్ణయాధికారం కోసం కాస్త మొండిగా వ్యవహరిస్తారు. ఈ లక్షణం కొన్ని సార్లు ఈ రాసివారిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ లోపాన్ని గుర్తించి జాగ్రత్తగా బయట పడాలి.
నాయకత్వం కోసం ఎంతటి కష్టాన్ని అయినా,శ్రమని అయినా పడతారు. ఈ రాశివారికి సర్దుబాటు తత్వం కాస్త తక్కువ అని చెప్పాలి. ఒక లక్ష్యం సాధించాలంటే అది సాధించేవరకు నిద్ర పోరు. దీర్ఘకాలంగా పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ గురించి నలుగురు ఏమి అనుకుంటున్నారో అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశి చైతన్యవంతమైన రాశి కావటంతో ఉత్సాహంగా ఉంటారు. దూసుకెళ్లే సమయంలో చిన్న విమర్శ ఎదురైనా మనసులో పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. ఈ రాశివారు తమలోని లోపాలు బయటకు కనపడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేక ఆలోచనల్లో అలజడి ఎక్కువై ఇబ్బందులు పడుతూ ఉంటారు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u