Hero Nani:హిట్ సినిమాను మిస్ చేసుకున్న నాని…ఏ సినిమానో తెలుసా?
Tollywood Hero Nani:నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన తొలి చిత్రం ‘అ!’ బాక్సాఫీస్ వద్ద క్రిటిక్స్ ప్రశంసలు పొందినా, కమర్షియల్ పరంగా డిజాస్టర్‌గా నిలిచింది.కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వాలనే నాని ఆలోచన బెడిసి కొట్టింది.కానీ మరోసారి అదే ఆలోచనతో నాని ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం హిట్ రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు.కాగా తొలుత ఈ సినిమా కథను దర్శకుడు శైలేష్ కొలను హీరో నాని కోసమే రాశాడట.కథ విన్న నాని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కావడంతో ఆలోచనలో పడి వద్దని చెప్పాడట.ఇప్పటికే ఆయన ‘వి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ను రెడీ చేస్తుండటంతో, మరోసారి అదే ఫార్ములాతో వస్తే బాగుండదని ఫీల్ అయ్యాడట.అందుకే దర్శకుడు శైలేష్‌కు ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది.
కానీ కథ నానికి బాగా నచ్చడంతో, హీరోగా కాకుండా నిర్మాతగా మారి ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడట.దీంతో హిట్ చిత్రం రూపొందిందని దర్శకుడు శైలేష్ చెప్పుకొచ్చాడు.ఇక భవిష్యత్తులో నాని కూడా శైలేష్‌తో ఓ సినిమా ఖచ్చితంగా చేస్తానని చెప్పడం విశేషం.
నానిని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయిన శైలేష్, మరి ప్రేక్షకులను ఎంతమేర ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసిన హిట్ నిజంగానే హిట్ అందుకుంటుందా అనేది ఈ శుక్రవారం తేలిపోతుంది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u