Kitchenvantalu

Brinjal Kothimeera Curry: ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా వంకాయ కొత్తిమీర తో మసాలా కర్రీ చేసుకోండి అదిరిపోతుంది

Brinjal Kothimeera Curry: ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా వంకాయ కొత్తిమీర తో మసాలా కర్రీ చేసుకోండి అదిరిపోతుంది
వంకాయ వంటి వంటకం తో వంటకం సరితూగదు. కూరల్లో రారాజు ఎలా చేసినా తగ్గేదేలే వంకాయ క్రేజు. కొత్తిమీర కారంతో వంకాయ స్పెషల్ చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
లేత తెల్ల వంకాయలు – 300 గ్రాములు
సోంపు – కొద్దిగా
నీళ్లు – 50 ml
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
పచ్చి శెనగపప్పు- గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు – 10
కొత్తిమీర పేస్ట్ కోసం..
కొత్తిమీర – 250 గ్రాములు
పచ్చి కొబ్బరి – ½ కప్పు
పచ్చిమిర్చి – 7-10
అల్లం – 1.5 ఇంచ్
ఉప్పు – తగినంత
చల్లని నీళ్లు – ½ కప్పు

తయారీ విధానం
1.కొత్తిమీర పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలన్ని మిక్సీ జార్లో వేసుకోని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
2. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి ఆవాలు,వెల్లుల్లి వేసి ఎర్రగా వేపుకోవాలి.
3.వేగిన వెల్లుల్లి లో పచ్చి నానపెట్టిన పచ్చి శనగ పప్పు వేసి కలుపుకోని తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి కలిపి మూతపెట్టుకోని 80 శాతం ఉడకనివ్వాలి.
4.ఉడికిన వంకాయలో కొత్తిమీర పేస్ట్ వేసి నెమ్మదిగా కలుపుకోని వంకాయలు మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5. అంతే వేడి వేడి అన్నం లోకి వంకాయ కొత్తిమీర కారం రెడి అయిపోయినట్టే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u