Prasadam Pulihora:హడావిడి లేకుండా ఈజీగా 15ని||ల్లోఅయిపోయే ప్రసాదం పులిహోర
Prasadam Pulihora Recipe at home: హడావిడి లేకుండా ఈజీగా 15ని||ల్లోఅయిపోయే ప్రసాదం పులిహోర.. జనరేషన్స్ మారుతున్నా, టేస్టూలు మారిపోతున్నా, కొన్ని వంటలు మాత్రం, ఎప్పటికీ అందిరి ఫేవరేట్ గానే మిగిగిపోతాయి. పండగలు అంటే గుర్తుకు వచ్చేది పులిహోర. సరైన కొలతలతో నోరు ఊరించే రుచి, ఎలా చేయాలో తెల్సుకోండి.
కావాల్సిన పదార్ధాలు
అన్నం కోసం..
బియ్యం – 1 కేజీ
నీళ్లు – రెండు లీటర్లు – 100ML
పసుపు – 1 టీస్పూన్
చింతపండు – గుజ్జు కోసం
గింజలు లేని చింతపండు – 120 గ్రాములు
వేడి నీళ్లు – 250ML
ఆవాల పేస్ట్ కోసం..
ఆవాలు -60 గ్రాములు
అల్లం – 1.5 ఇంచ్
ఎండు మిర్చి – 2
పసుపు – 1/2టీస్పూన్
ఉప్పు – కొద్దిగా
వేడి నీళ్లు – కొద్దిగా
నూనె – 2 టేబుల్ స్పూన్స్
పులిహోరకు..
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చిమిర్చి – 8
కరివేపాకు -3 రెబ్బలు
తాళింపు –
నువ్వుల నూనె లేదా వేరు శనగనూనే – 3/4కప్పు
పల్లీలు – 3/4కప్పు
ఆవాలు – 1.5 టేబుల్ స్పూన్
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
పచ్చిశనగరప్పు – 2 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి – 15
ఇంగువ – 1 టీస్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
తయారీ విధానం
1.చింతపండులో వేడి నీళ్లు పోసి, చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోండి.
2. ఇప్పుడు మిక్సీ జార్ లో ఆవాల పేస్ట్ కోసం పెట్టుకున్న పదార్ధాలను, వేసుకుని, వేడి నీళ్లతో కలపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
3. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కు నూనె కలిపి, పక్కన పెట్టండి.
4. ఇప్పుడు బియ్యం లో నీళ్లు పోసి, పసుపు వేసి , హై ఫ్లైమ్ పై ఉడకనివ్వాలి.
5. ఉడుకుతున్న అన్నాన్ని, నెమ్మదిగా కలిపి, అన్నంపై మూత పెట్టి, దాని పై నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్ పై 90 శాతం వరకు ఉడికించుకోవాలి.
6. ఇఫ్పుడు ఉడికిన అన్నంలో నూనె పోసి, నెమ్మదిగా కలుపుకుని, వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి.
7. ఇప్పుడు అన్నానికి ఉప్పు, పచ్చిమిర్చి, కరవేపాకు, చింతపండు గుజ్జు వేసి, అన్నం విరగకుండా కలుపుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, తాళింపు కోసం వేసిన పదార్ధాలతో పోపు వేసి, పులిహోరలో కలుపుకోవాలి.
9. అందులోకి ఆవాల పేస్ట్ వేసి నెమ్మదిగా కలుపుతూ 30 నిముషాలు పక్కన పెట్టాలి.
10. అంతే పులిహోర రెడీ అయినట్లే.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u