Diabetes For Lemon Juice:డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగితే ఏమి అవుతుందో తెలుసా?
Diabetes For Lemon Juice:డయాబెటిస్ ఉన్నవారు నిమ్మరసం తాగితే ఏమి అవుతుందో తెలుసా.. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వేసుకోవలసిందే. కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే కొన్ని ఆహారాలను తినకూడదు.
మధుమేహం ఉన్నవారికి మేలు చేసే ఆహారాల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయను తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో తరచుగా ఏదో ఒక అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతాయి.
అలాగే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు వస్తు ఉంటాయి. ఇలా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు.
డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ విషయంలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u