ROBO Movie:రోబో మూవీ వెనుక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా…ఎన్ని కోట్ల లాభమో
ROBO Movie: భారతీయ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మైలురాయిగా నిలిచిన సినిమాల్లో ఒకటి రజనీకాంత్ ‘రోబో’. సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియాలో 75కోట్ల భారీ బడ్జెట్ అంటే అప్పట్లో ఎక్కువ. అలాంటిది 130కోట్ల భారీ భారీ బడ్జెట్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2008లో తీసిన రోబో మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు.
రజనీ ,శంకర్ ల కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ రికార్డ్స్ అన్నీ కళ్ళు చెదిరేలా ఉంటాయి. 2001లో నాయక్ ప్లాప్ కావడంతో ఢీలా పడిన డైరెక్టర్ శంకర్ బాగా ఆలోచించి ఇండియా అంతటా తన సినిమా గురించి మాట్లాడు కోవాలని ఎప్పుడో తయారుచేసిన రోబో స్టోరీని కమల్ హాసన్ కి వినిపిస్తే ఒకే చేసాడు. హీరోయిన్ గా ప్రీతి జింటా కన్ఫర్మ్. ఫోటో షూట్ అయింది. అయితే కమల్ డేట్స్ తో తేడా రావడంతో సినిమా ఆగిపోయింది. బాయ్స్, అపరిచితుడు, శివాజీ మూవీస్ శంకర్ చేసాడు.
అయితే రోబో ఎలాగైనా తీయాలని షారూఖ్ ఖాన్ కి చెప్పాడు. ఒకే చేస్తూ, పూర్తి స్క్రిప్ట్ అడగడంతో అలా ఇవ్వడం ఇష్టంలేని శంకర్ అక్కడితో వదిలేసాడు. రజనీకి చెప్పడంతో ఒకే చేసాడు. 100కోట్ల బడ్జెట్ తో తీసే ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ ఉండాలని స్వయంగా కల్సి ఒప్పించాడు శంకర్. అందుకోసం ఏకంగా 6కోట్లు ఛార్జి చేసింది. ఇది అప్పట్లో చాలా పెద్ద ఎమౌంట్. ఇక రజనీ 45కోట్లు అందుకున్నాడు.
నిజానికి సైన్టిస్ట్ రోల్ కి అమితాబ్ అనుకున్నా,రజనీ నెగెటివ్ రోల్ అవుతుందని ఆ ప్రపోజల్ వదిలేసి,డ్యూయల్ రోల్ రజనీకి వదిలేసారు. సత్యరాజ్,జెడి చక్రవర్తి విలన్లు అనుకున్న చివరకి చైనా నటుడిని సెలెక్ట్ చేసారు. 2008 ఫిబ్రవరి 8న షూటింగ్ స్టార్ట్ అయింది. రోబో గెటప్ కి మూడు కోట్లు ఖర్చు. 20మంది డిజైనర్స్ హాలీవుడ్ నుంచి చెన్నైలో ఉండి పనిచేసారు.
దాదాపు 30సెట్స్ వేశారు. బేబీ డెలివరీ సీన్ నాలుగు నెలలపాటు తీసారట. క్లైమాక్స్ కి 5కోట్లు ఖర్చయింది.ఇక హీరోస్ సంస్థ సినిమాలన్నీ ఈలోగా ప్లాప్ కావడంతో సన్ పిక్చర్స్ రోబో ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యారు. గ్రాఫిక్స్ కి 60కోట్లు,ఓ పాటలో ఐశ్వర్యకు 50రకాల డిజైన్స్ వాడారు. సినిమా అయ్యేసరికి 130కోట్ల బడ్జెట్ అయింది. 290రోజుల వర్కింగ్ డేస్. జెంటిల్ మ్యాన్ మూవీ చేయలేదని ఈ మూవీ కి ఇంతగా కష్టపెట్టి కసి తీర్చుకున్నావా అని శంకర్ తో రజనీ జోక్ చేసాడట.
రెహ్మాన్ మ్యూజిక్ తో ఆడియో రైట్స్ 7కోట్లు పలికింది. హిందీలో 30కోట్లు,తెలుగు రైట్స్ 27కోట్లు. అప్పటికి అంతలా మార్కెట్ లేదు. వరల్డ్ వైడ్ 2300ప్రింట్స్ తో రిలీజ్ అయింది. రజనీ మెస్మరైజింగ్,ఐశ్వర్య అందాలు,రెహ్మాన్ మ్యూజిక్,శంకర్ పనితనం, అబ్బురపరిచే గ్రాఫిక్స్, మొత్తం మీద ఈ మూవీ తమిళనాట 100కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగులో 38కోట్లు,మొత్తంగా ఇండియాలో రోబో టాప్ మూవీ గా చరిత్ర సృష్టించింది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u