MoviesTollywood news in telugu

Nuvvu Nenu Movie:నువ్వు నేను సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు

Nuvvu Nenu Movie :గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా,పాట విన్నా, ఈ పెద్దోళ్లున్నారే అనే డైలాగ్ విన్నా అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా యూత్ లో క్రేజ్ .. ఇవి నువ్వు నేను మూవీలోవి. చిత్రం మూవీ తర్వాత మళ్ళీ తేజ డైరెక్షన్ లోనే ఉదయ్ కిరణ్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్. సినిమా కొన్నవారికి 10రెట్ల లాభాలు తెచ్చిపెట్టిన చిన్న సినిమా ఇది. 20కోట్ల గ్రాస్ వసూలు చేసి,70కేంద్రాల్లో 100రోజులు ఆడింది. హైదరాబాద్ సింగిల్ థియేటర్ లో కోటి వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తేజకు త్రివిక్రమ్ శ్రీనివాస్,దశరధ్ రైటర్స్ గా వ్యవహరించిన చిత్రమిది.

ఈ మూవీ విశేషాల్లోకి వెళ్తే, చిత్రం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ తర్వాత సినిమా విక్టరీ వెంకటేష్ తో బుక్ అయింది. అన్నీ ఒకే అనుకున్నాక కథ వినిపించాడు. అయితే మరో స్టోరీ తయారుచేయమని చెప్పి,నువ్వు నాకు నచ్చావ్ మూవీకి వెంకీ కమిట్ అయ్యాడు. దీంతో విసుగు చెందిన తేజ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే రోడ్డు అడ్డంగా గొర్రెలు తోలుకొస్తున్న అమ్మాయి,అటువైపు విసుగ్గా ఖరీదైన కారులో ఓ యువకుడు .. ఈ సీన్ చూసాక తేజ బుర్రలో ఏదో ఐడియా వచ్చింది.

వెంటనే వెంకీతో తీద్దామనుకున్న నిర్మాతను కల్సి,వెంకీతో సినిమా కేన్సిల్ అయింది కనుక ఇప్పుడు ఇంకో సినిమా స్టోరీ చెబుతాను విను అంటూ ‘హీరో కోటీశ్వరుడు, హీరోయిన్ గొర్రెలు కాసుకునే వాడి కూతురు’ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో సినిమాకు రెడీ అయ్యాడు. ముహూర్తం బాగుందని షూటింగ్ కూడా మర్నాడే స్టార్ట్ చేసి,అప్పుడు స్టోరీ మీద కూర్చున్నారు. హీరో ,హీరోయిన్స్ తప్ప మిగతావాళ్లంతా రెడీ అయ్యారు. సుమంత్ ని అడిగితె ఒప్పుకోలేదు, మాధవన్ రిజక్ట్ చేసాడు. ఇక ఎవరితో చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో హీరో ఉదయ్ కిరణ్ వచ్చాడు.

తొలిమూవీకి డైరెక్టర్ కావడంతో అతడిని తర్వాత సినిమా గురించి సలహా కోసం వచ్చాడు. అయితే తేజ ఏమీ మాట్లాడకపోవడంతో ఏదో ఆలోచనలో ఉన్నారనుకుని లేచి వెళ్లిపోతుంటే,’నువ్వు జిమ్ చేసి బాడీ బాగా పెంచు. తర్వాత సినిమాలో నువ్వే హీరో’అని తేజ చెప్పడంతో ఉదయ్ ఎగిరి గంతేసాడు.

ఇక హీరోయిన్ సెలక్షన్ కోసం వందమందితో ఆడిషన్స్ చేసారు. ఒక అందమైన అమ్మాయిని సెలక్ట్ చేసాక , ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది. దీంతో ఫలానా హోటల్ కావాలి,ఫలానా కారు కావాలి అంటూ ఆమె బిల్డప్ ఇవ్వడంతో తేజకు కోపం చిర్రెత్తుకొచ్చింది. అక్కడున్న అమ్మాయిల్లో చూసి,వీళ్లల్లో చీప్ ఎవరనిపిస్తోంది అని అడిగాడు.

దాంతో సదరు హీరోయిన్ ఓ అమ్మాయిని చూపించడంతో,అయితే ఆమె నా హీరోయిన్,ఇక నువ్వేళ్లొచ్చు అని చెప్పడంతో ఆమె షాకయింది. అలా అనిత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. హైదరాబాద్,ముంబయి,వికారాబాద్ లలో షూటింగ్ చకచకా చేసారు. మొత్తం 11పాటలు,అందులో మూడు తీసేద్దామని ప్రొడ్యూసర్ అనగానే తేజ వద్దన్నాడు. కోటి 60లక్షల బడ్జెట్ తో 2001ఆగస్టు 10న మూవీ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్. ఉదయ్ కి రాష్ట్రవ్యాప్తంగా ఫాన్స్ వస్తే, తేజ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్,లిరిక్ రైటర్ కులశేఖర్,ధర్మవరపు సుబ్రహ్మణ్యం,తెలంగాణ శకుంతల,వైజాగ్ ప్రసాద్ లకు బ్రేక్ ఇచ్చింది.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u