DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:November 26 రాశి ఫలాలు-ఈ రాశి వారికి ఆటంకాలు వస్తాయి…మీ రాశి ఉందా…?

November 26 Horoscope in Telugu:ప్రతి రోజు జాతకాలను చూసుకుంటూ అడుగులు వేసే వారు చాలా మంది ఉన్నారు. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ప్రతి రోజు రాశి ఫలాలను తెలుసుకొని వాటికీ అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ రాశి ఫలాలు.

మేషరాశి
ఈ రాశి వారు చేసే పనిలో మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. కొన్ని సంఘటనలు కొంత బాధను కలిగిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. చేసే పనిలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వృషభ రాశి
ఈ రాశి వారు ఆత్మ శుద్ధితో పనిచేస్తే విజయాలను అందుకుంటారు. తరచూ నిర్ణయాలను మార్చుకోవటం వలన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి.

మిధున రాశి
ఈ రాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకొనే సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చేసే ప్రతి పనిని పట్టుదలతో చేస్తారు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి చేసే పనిలో శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయాలను మాత్రం సొంతం చేసుకుంటారు. వివాదాల జోలికి అస్సలు వెళ్ళకూడదు.పనులలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి.

సింహరాశి
ఈ రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏ పని చేసిన మనోధైర్యంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది.

కన్యా రాశి
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు వెళ్ళకూడదు.

తులారాశి
ఏ పని చేసిన బాగా ఆలోచించి చేయాలి. చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని జాగ్రత్తగా అధికమించాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో మంచి మద్దతు లభిస్తుంది. దాంతో వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మకర రాశి
ఈ రాశి వారు ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. మనో బలం తగ్గకుండా చూసుకోవాలి.

కుంభరాశి
ఈ రాశి వారికి శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది. కలహాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు లేకుండా చూసుకోవాలి.

మీన రాశి
ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం బాగా పెరుగుతుంది. వివాదాల జోలికి అసలు వెళ్ళకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u