Beauty Tips

White Hair Tips:పాతికేళ్ళు కూడా రాక ముందే తెల్ల జుట్టు వచ్చేసిందా..?

White Hair Turn Black home remedies :తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తెల్లజుట్టు సమస్య ప్రారభంలోనే ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది.

మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది దీని కోసం అవసరం అయ్యే అన్ని ఇంగ్రిడియన్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి.

పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి 2 లీటర్ల నీటిని పోసి కాస్త వేడి అయ్యాక.. 1 tsp ఉసిరి పొడి, 2 tsp బ్లాక్ టీ, 1 tsp కాఫీ పొడి, 1/2 అంగుళాల ముక్క catechu, చిన్న ముక్క వాల్నట్ బెరడు, 1 tsp ఇండిగో పొడి, 1 tsp బ్రహ్మి పొడి మరియు 1 tsp త్రిఫల పొడి వేసి బాగా కలపాలి.

దాదాపుగా అరగంట మరిగించి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి గాలి చొరబడని సీసాలో పోసి నిల్వ చేస్తే దాదాపుగా పది రోజుల పాటు వాడుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి పలితాన్ని పొందవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.

తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఉసిరిలో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. బ్లాక్ టీలో టానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ టాక్సిన్స్​ను తొలగించి స్కాల్ప్​ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విధంగా మీరు బ్లాక్ టీని ఉపయోగించడం ద్వారా జిడ్డు జుట్టును కూడా వదిలించుకోవచ్చు. అంతేకాకుండా, బ్లాక్ టీ జుట్టును మెరిసేలా, మృదువుగా, చుండ్రు లేకుండా చేస్తుంది.

అలాగే మీరు తరచుగా జుట్టుకు బ్లాక్​ టీని అప్లై చేయడం ద్వారా తెల్ల జుట్టు, జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మీరు జుట్టుకు సహజంగా రంగు వేయడానికి బ్లాక్ టీని ఉపయోగించవచ్చు. దీనిలో తీసుకున్న అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తాయి.

తెల్లజుట్టు సమస్యను తగ్గించటానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ చిట్కాను ఎటువంటి ఆలోచన లేకుండా పాటించి సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u