MoviesTollywood news in telugu

Tollywood Star Heroes:మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?

Tollywood Heroes:సినిమాల్లో నటించే నటి నటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు వారి అభిమన నటుడు లేదా నటి గురించిన సమాచారం తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. మన టాలీవుడ్ హీరోలు వారు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారో తెలుసుకుందాం.

మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, ప్రభాస్,రామ్ చరణ్ వంటి వారు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారో తెలుసుకుందాం. వీరందరూ సినిమాల్లోకి వచ్చి తమను తము నిరుపించుకొని తమకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని సక్సెస్ గా ముందుకు సాగుతున్నారు. మీరు కూడా ఆ వివరాలను తెలుసుకోండి. మరి ఇక ఆలస్యం ఎందుకు..

మన టాలీవుడ్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు. అలాగే వారు ఎంత వరకు చదువుకున్నారు. వారు చదువు అయ్యాక సినీ రంగానికి వచ్చి తామెంతో నిరూపించుకున్నారు. వారి గురించి తెలుసుకుందాం.

1. మహేష్ బాబు
mahesh babu
సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నై లో లయోలా కళాశాల నుంచి కామర్స్ లో బాచిలర్స్ డిగ్రీ పొందాడు. చదువు పూర్తయిన తర్వాత, అతను 1999 లో ‘రాజ కుమారుడు’ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.

2. పవన్ కళ్యాణ్
pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు యుద్ధ కళల ట్రేనీ గా పనిచేసేవాడు. ఆయన 1998 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా నటనకు శ్రీకారం చుట్టాడు.

3. ప్రభాస్
prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్కూల్ చదువు భీమవరం DNR స్కూల్ లో, ఇంటర్ మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ లో చదివాడు. ప్రభాస్ B.tech పూర్తి చేసాక 2002 లో సినిమాల్లోకి వచ్చాడు.

4. రామ్ చరణ్

1985 లో జన్మించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చెన్నై లో పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్లో చదివాడు. అతను సినిమాల్లోకి రాక ముందు మార్షల్ ఆర్ట్స్ అండ్ హార్స్ రైడింగ్ లో ప్రొఫెషనల్ శిక్షణను పొందాడు.

5. గోపీచంద్

గోపీచంద్ సినిమాల్లోకి రాక ముందు ప్రముఖ వార్తా చానెల్ ETV లో న్యూస్ రీడర్ గా పనిచేసాడు. 2001 లో ‘తోలి వలపు’సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసాడు.

6. నాని
Tollywood Hero Nani
నాని సినిమాల్లోకి రాక ముందు విశాఖపట్నంలో ఒక రేడియో జాకీగా పనిచేసేవాడు. సినిమాల్లోకి వచ్చాక మొదటి సినిమా ‘అలా మొదలైంది’ ద్వారా హిట్ కొట్టాడు.

7. మోహన్ బాబు
Mohan Babu alludu garu movie
మోహన్ బాబు స్కూల్ లో ఫిజికల్ ట్రైనర్ గా పనిచేసేవారు. 1974 లో ‘కన్నవారి కలలు’ సినిమా ద్వారా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చారు.

8. బ్రహ్మానందం

బ్రహ్మానందం సినిమాల్లోకి రాక ముందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని అత్తిలి పట్టణంలో లెక్చరర్ గా పనిచేసేవాడు. ఈ హాస్య నటుడు అనేక సినిమాలను చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u