MoviesTollywood news in telugu

Tollywood Heroes costumes :హీరో,హీరోయిన్ లు వాడిన లక్షల రూపాయల దుస్తులు ఏం చేస్తారో తెలుసా?

Tollywood Heroes costumes :సినిమాలకు సంబందించిన సమాచారం ఏది ఉన్నా.. దాని గురించి తెలుసుకోవటానికి అభిమానులు ముందు వరుసలో ఉంటారు. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ లేదా డైరెక్టర్ ఇలా అందరి గురించి తెలుసుకోవటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు.

సినిమా అంటే హీరో ,హీరోయిన్, విలన్ , డైరెక్టర్, మ్యూజిక్, టెక్నీషియన్స్ , ఆర్ట్ డైరెక్టర్ ఇలా చాలా వింగ్స్ ఉంటాయి. అయితే సెట్టింగ్స్ కి ఎంత ఖర్చు చేస్తున్నారో అప్పట్లో పెద్ద టాక్ అయ్యేది. కానీ ఇటీవల కాలంలో ఆర్టిస్టుల క్యాస్టూమ్స్ కి కూడా భారీ ఎత్తున వెచ్చిస్తున్నారు. దాంతో వీటిపై కూడా రకరకాల వార్తలు, కథనాలు వైరలవుతున్నాయి.
prabhas
అప్పట్లో ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ సినిమాల దుస్తులు జ్ఞాపకంగా తమతోపాటే తీసుకెళ్లేవారని టాక్. ఇప్పుడు కూడా ఇలాంటి ట్రెండ్ కొందరు హీరోల్లో ఉందని అంటారు. ముఖ్యంగా మగధీర, బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాల్లో ఎక్కువమంది జనాన్ని చూపించడం వలన ఎక్కువ కాస్ట్యూమ్స్ అవుతాయి.కానీ తక్కువ జనం ఉన్నా, హీరోల కోసమే కోట్లకు కోట్లు కాస్ట్యూమ్స్ కోసం వెచ్చిస్తున్నట్లు తాజాగా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యాం మూవీ దుస్తుల గురించి వార్తలొచ్చాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమాలో హీరో మొదలు ఇతర తారాగణం వేసుకునే కాస్ట్యూమ్స్ కి సాధారణ ప్రజలు ధరించే దుస్తులకు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఖరీదు విషయంలో చాలా తేడా ఉంటుంది. అగ్నిపర్వతం సినిమాలో వన్ వన్ నెంబర్ వన్ సాంగ్ కోసం ఏకంగా పది డ్రెస్ లు సూపర్ స్టార్ కృష్ణ కోసం వెచ్చించినట్లు అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు.
Tollywood Hero Allu Arjun
ఇలా చూస్తే ఒక్క సినిమాలోనే నటీనటులు కనిపించే సన్నివేశాలను బట్టి రకరకాల దుస్తులు వేసుకుంటారు. ఇక మూవీ మొత్తం ఎన్ని వాడతారో మిలియన్ డాలర్ల ప్రశ్న. సోషల్ మూవీస్ కు ఒకలాంటి డ్రెస్సులు, పీరియాడికల్ సినిమాలకు మరోరకమైన దుస్తులు ఇలా సినిమా సినిమాకి వేరియేషన్ ఉంటుంది. మామూలు చిన్న సినిమాకి అయితే సినిమా పూర్తయ్యే లోపు దుస్తులకే లక్షలాది రూపాయలు వెచ్చిస్తారు.
mahesh babu
భారీ బాగేజ్ట్ మూవీ అంటే కోట్లలోనే కాస్ట్యూమ్స్ కి ఖర్చుపెట్టాలి. అయితే ఇటీవల వచ్చితిన్ సాంకేతిక పరిజ్ఙానం కూడా జోడించి, సినిమా పూర్తయిన తర్వాత దుస్తులను వెనక్కి పంపించి కొత్త పద్ధతుల్లో డిజైన్ చేసి, కుడతారట. ఇక ఇదే తరహా సినిమాలకు అవసరం ఉంటే, వాళ్ళకి ఇస్తారు. అప్పుడు అదనంగా డిజైన్స్ యాడ్ చేసి వాడతారట. అయితే ఆడియన్స్ గుర్తు పట్టలేని విధంగా డ్రెస్ లను మార్చేయడం కూడా ఓ కళ.

సినీ మాయ ప్రపంచంలో ఎన్నో మాయలు మరియు విద్దురాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పుడు సంవత్సరానికి ఎన్నో సినిమాలు కనువిందు చేసేవి. కానీ ఇప్పుడు సినిమాలను హీరోలు మరియు దిరేచ్తెర్స్ చాలా తక్కువగా చేస్తున్నారు. సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువగా తీసుకుంటున్నారు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u