Seetharama Kalyanam:సీతారామ కళ్యాణం సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు…
Seetharama Kalyanam Movie :హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పౌరాణికం కాదు. సాంఘిక చిత్రమే. రామాపురంలో రాముడు విగ్రహం, రాఘవాపురంలో సీత విగ్రహం ఉంటె,ఆ రెండు గ్రామాల ఒకే కుటుంబీకుల మధ్య 14ఏళ్లపాటు గొడవల కారణంగా ఎడబాటుగా వున్న విగ్రహాలు ఒకేచోటకు చేరడమే ఈ చిత్ర కథ. జంధ్యాల డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కించాడు. బాలకృష్ణ,రజనీ కాంబినేషన్ లో వచ్చిన ఈమూవీకి కెవి మహదేవన్ సంగీతం ప్లస్ పాయింట్. కె మురారి యువచిత్ర బ్యానర్ లో తీసిన ఈ సినిమా విశేషాలలోకి వెళ్తే,భానుప్రియను హీరోయిన్ అనుకుంటే చివరికి రజనీ సెలెక్ట్ అయింది.
జంధ్యాల తన అభిరుచి కంటే,నిర్మాత అభిరుచికి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చారు. రెండు గ్రామాల మధ్య విగ్రహాల గొడవల నేపథ్యంలో కలెక్టర్ మధ్యవర్తిగా ఉండి గుడి కట్టించాడన్నది పేపర్ లో వచ్చిన వార్త సారాంశం. అదే ఈ చిత్ర కథకు ప్రేరణ. 6నెలలపాటు కథా చర్చలు జరిగాయి. ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ కూడా ఇందులో పాలుపంచుకున్నారు. యువచిత్ర వారి ఆస్థాన సంగీత దర్శకుడు మహదేవన్ సంగీతం ఫిక్స్.
ఇక ఆత్రేయ నాలుగు,ఆరుద్ర రెండు పాటలు రాసారు. ఓ సాంగ్ వేటూరి రాసారు. ఆడియో మార్కెట్ లో విడుదల చేసి,ఇందులో బాగున్న పాటలు ఏమిటో చెప్పమని ఆడియన్స్ కి ఛాన్స్ ఇవ్వడంతో ముద్దు పద్దు సాంగ్ తొలగించి వేటూరితో ఏమని పాడను అనే సాంగ్ వేటూరితో రాయించి చిత్రీకరించారు. యువ ప్రేమికులు పాడుకునే రాళ్ళల్లో ఇసుకలో రాసాము ఇద్దరి పేర్లు అనే సాంగ్ ఆత్రేయ రాసారు. మురారి కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. హీరోహీరోయిన్స్ చిన్నప్పుడు కల్సి ఆడుకుంటారు. తర్వాత విడిపోతారు. పెద్దయ్యాక కలుసుకుంటారు.
ఈ సాంగ్ భద్రాచలంలో గోదావరి తీరాన తీశారు. కల్యాణ వైభోగమే సాంగ్ కోసం గోదావరి మధ్య లంకల్లో విద్యుద్దీపాలతో ఆరు సెట్స్ వేసి ఐదు రాత్రుల్లో ఈ సాంగ్ షూట్ చేసారు.140మంది ఎలక్రిష్టియన్స్ పనిచేసారు. ఈ సాంగ్ సెట్స్ కి అప్పట్లో 2న్నర లక్షల ఖర్చు అయింది. ఇప్పటికీ కల్యాణ వేడుకల్లో ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. మరో వందేళ్లయినా ఈ సాంగ్ విలువ తగ్గదు. గ్రామ, పట్టణ ప్రాంతాల మధ్య కథ కావడంతో నేచురాలిటీ కి దగ్గరగా రాజమండ్రి పరిససరాల్లో ఈ చిత్ర షూటింగ్ చేసారు.
ప్రసిద్ధమైన రాజమండ్రి గౌతమీ గ్రంధాలయంలో బాలయ్య,రజనీ,సుత్తివేలుతో మూడు సన్నివేశాలు తీశారు. సినిమా మొత్తం రెడీ అయ్యాక చిన్న చిన్న తేడాలు రావడంతో మళ్ళీ 13రోజులు రీషూట్ చేసారు. సీరియస్ లవ్ స్టోరీతో సాగే ఈ మూవీలో హృదయాన్ని హత్తుకునే సాంగ్స్,హాస్యం ఉండడంతో రిలీజ్ రోజే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మురారి అల్లుకున్న కథ కనుక టైటిల్స్ లో ఎవరీ పేరు లేదు. సంభాషణలన్నీజంధ్యాల రాసారు. అసిస్టెంట్ గా చేసిన ఈవివి సత్యనారాయణ ఇందులోని ఫైట్స్ చిత్రీకరించారు.
అందరూ మెచ్చుకోవడంతో దాంతో సొంతంగా డైరెక్షన్ చేయగలనన్న నమ్మకం ఈవివిలో ఏర్పడింది. 14సెంటర్స్ లో 100రోజులు ఆడిన ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు 1986జులై 27న మద్రాసు విజయశేషు థియేటర్ లో జరిగాయి. దాసరి నారాయణరావు అధ్యక్షత వహించగా, గొల్లపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. బాలయ్య,రజనీ నటన,జంధ్యాల దర్శకత్వ ప్రతిభ,మురారి నిర్మాణ దక్షత, మహదేవన్ సంగీతం ఈ సినిమాను విజయ పథాన నిలబెట్టాయి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u