Samba Movie:”సాంబ” సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా…
Samba Movie:”సాంబ” సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో తెలుసా… జూనియర్ ఎన్టీఆర్ మంచి మాస్ ఇమేజ్ తో పీక్ స్టేజ్ లో దూసుకెళ్తున్న సమయంలో వచ్చిన సాంబ మూవీ ఫాన్స్ ని ఖుషీ చేసింది. అదే సమయంలో డైరెక్టర్ వివి వినాయక్ కూడా పీక్ స్టేజ్ లో ఉండడం వలన ఇద్దరి కాంబోలో ఆది తర్వాత వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలై ఈ సినిమా ఎబో ఏవరేజ్ గానే మిగిలింది. మొదటివారం 8కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైం టాప్ మూవీ 2గా నిల్చింది. నెల్లూరు ,గుంటూరు,ఉత్తరాంధ్రలో తొలివారం రికార్డ్ క్రియేట్ చేసింది.
మొత్తం 14కోట్లకు పైనే షేర్ కలెక్ట్ చేసిన సాంబ 105డైరెక్ట్ సెంటర్స్ 50రోజులు,5సెంటర్స్ లో వంద ఆడింది. బ్లాక్ బస్టర్ అయితే మరో 25కోట్లు కలెక్ట్ చేసేది. తమిళం,కన్నడలో రీమేక్ చేసిన ఈ మూవీ హిందీలో డబ్బింగ్ అయింది. 2003లో తారక్ నటించిన సింహాద్రి మూవీతో ప్రభంజనం సృషించాడు. దీనితర్వాత పూరి జగన్నాధ్ తో ఆంధ్రావాలా, వినాయక్ తో మూవీ ప్రకటించాడు. పూరి డైరెక్షన్ లో మూవీ షూటింగ్ జరుగుతోంది. అది అయ్యాక వినాయక్ సినిమా చేయాలి. అది 9వ సినిమా. 9సెంటిమెంట్ కనుక తన సన్నిహితుడైన కొడాలి నానికి అప్పగించాడు.
చిన్ని కృష్ణ చెప్పిన కథ ఇంద్ర,నరసింహనాయుడులా ఉండడంతో సింహాద్రికి పనిచేసిన జిఎస్ రావ్ కి కథను వినాయక్ అప్పగించాడు. దాంతో కాంచీపురం నేపథ్యంలో రూపొందించిన కథ అందరికీ నచ్చింది. తారక్ ఇమేజ్ కి తగ్గట్టు 19సీన్స్ అదనంగా రాయగా, కోన వెంకట్ డైలాగ్స్ అందించారు. ఠాగూర్ షూటింగ్ లో ఉంటూనే వినాయక్ స్క్రీన్ ప్లే రాసేవారు. ఆర్తి అగర్వాల్ ,రక్షిత హీరోయిన్స్. తారక్ తండ్రిగా నాజర్ ని అనుకుని విజయచందర్ ని తీసుకున్నారు. 2003అక్టోబర్ 10న ముహూర్తపు షాట్ తీశారు.
రాజమౌళి,పూరి జగన్నాధ్ గెస్ట్ లుగా వచ్చారు. అప్పటికే ఠాగూర్ హిట్ అవ్వడంతో వినాయక్ రేంజ్ కూడా పెరిగింది. దీంతో తారక్ ఫాన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. నవంబర్ 9నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్. ఆర్తి అగర్వాల్ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడంతో భూమికను తీసుకున్నారు. కాంచీపురం,ధర్మవరం ప్రాంతాల్లో షూటింగ్. ఈలోగా ఆంధ్రావాలా ప్లాప్ కావడంతో రక్షిత ప్లేస్ లో జెనీలియాకు తీసుకున్నారు.
రాయలసీమలో విద్య ద్వారా ఫ్యాక్షనిస్టులు హ్యూమనిస్టులుగా మార్చొచ్చు అనే కంటెంట్ తో 90పనిదినాల్లో 12కోట్ల బడ్జెట్ తో సినిమా కంప్లిట్. 2004మే16న షూటింగ్ పూర్తయ్యాక తొలికాపీ రెడీ అయింది. 20న తారక్ పుట్టినరోజు సందర్బంగా ఆడియో రిలీజవ్వడంతో మణిశర్మ మ్యూజిక్ హిట్ అయింది. జూన్ 9న 422సెంటర్స్ లో సాంబ భారీగా రిలీజయింది. ఫాన్స్ చేసిన హడావిడికి తగ్గట్టు సినిమాకు హిట్ టాక్. పెద్ద హిట్ అవుతుందని సంబరాలు కూడా చేసారు. వినాయక్ తన మార్క్ చూపించగా, తారక్ నటనతో అదరగొట్టాడు.
డైలాగ్స్,కార్ల ఛేజింగ్ అన్నీ ఫాన్స్ కి పూనకం తీసుకొచ్చాయి. అన్నీ బాగున్నా మితిమీరిన హింస మైనస్ అయింది. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని ప్రకాష్ రాజ్ చంపేయడం,వదినపై మరిది బలాత్కారం, భర్త సపోర్ట్ చేయడం .. ఇవన్నీ జనానికి నచ్చలేదు. అసలు ఈ సీన్స్ ఎందుకు తీశానా అని వినాయక్ ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయ్యారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమా ఎబో ఏవరేజ్ గా మిగిలింది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u