Curry Leaves:మీ పెరటిలో దొరికే చిటికెడు పొడి నోట్లో వేసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు
Nerves Weakness Home Remedies : కూరల్లో కరివేపాకు వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెబితే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి.
ఈ మధ్య కాలంలో నరాల బలహీనత అనేది ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అందువల్ల నరాల బలహీనత కనపడగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నాడీ వ్యవస్థ మొత్తం శరీరంలో పంపిణీ చేయబడినందున, శరీర భాగాలకు ఏదైనా గాయం అయినా, ఒత్తిడి కలిగినా నరాలు బలహీనపడటానికి దారితీయవచ్చు.
ఈ సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా నరాల బలహీనత సమస్య నుండి బయట పడవచ్చు. నరాల బలహీనత సమస్యను తగ్గించటానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి.
మన ఇంటిలో రెగ్యులర్ గా వాడే కరివేపాకు నరాల బలహీనతను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు 5 కరివేపాకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు. లేదా కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకును పొడిగా తయారుచేసుకొని అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని తినవచ్చు.
కరివేపాకు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కరివేపాకు మన మెదడును రక్షించే యాంటీఆక్సిడెంట్లను పెంచుతుంది. న్యూరాన్‌లకు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా నరాలకు సంబందించిన సమస్యలు రాకుండా చేస్తుంది. నరాల బలహీనత సమస్యను తగ్గిస్తుంది. నరాలు బలహీనంగా లేకుండా గట్టిగా ఉండేలా చేస్తుంది.
కరివేపాకులో కోయినీ జెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది.అందుకే దాని రుచీ,వాసనలు డిఫరెంట్ గా ఉంటాయి.కరివేపాకుని ఇంట్లో పెంచినట్లైతే ఒక మందుల షాపుని మన ఇంట్లో ఉంచుకున్నట్టే అవుతుంది. కరివేపాకు చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. కాబట్టి కరివేపాకును తీసుకొని ఈ సమస్య నుండి బయట పడండి.
నరాల బలహీనతను తగ్గించటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది.
కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడపున కరివేపాకుని తింటే మూత్రిపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలిగి వాటి పనితీరు మెరుగు అయ్యి కిడ్నీలు ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u