Chapped Lips : పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి.
Chapped Lips : చలికాలం వచ్చిదంటే చాలు. చర్మ సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా పెదాలు కూడా పగులుతుంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్యల్ని దూరం చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి… ఎదుటివారిని ఆకర్షించాలంటే అన్నిటికన్నా ముందు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. కాని కొందరు అలా నవ్వడానికి కూడా మొహమాటపడతారు. వారి పెదాలు నల్లగా ఉండడం.. లేక వీరి పెదాల చుట్టూ నల్లగా ఉండడం వల్ల వీరు నలుగురిలో నవ్వడానికి వెనకాడతారు.
శరీరంలో విటమిన్ల లోపం ఉంటె పెదాలు ఇలా నల్లగా మారుతాయి. మరో కారణం తరచూ నాలుకతో తడుపుతూ ఉండటం. ఇవే కాదు.. పెదాలు నల్లబడడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి.
ఇలా నల్లగా ఉన్న పెదాలను .. సహజ రంగులోకి మార్చుకోడానికి కొన్ని చిట్కాల తెలుసుకుందాం.
1. నీళ్లూ, కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ శారేరంలో తేమ పుష్కలంగా ఉండి పెదాలు పొడిబారకుండా అలాగే నల్లగా మారకుండా ఉంటాయి. ఇవి తినడంతో పాటు లిప్ బామ్ ను రెండు పూటలా రాసుకోవాలి. ఎస్.పీ.ఎఫ్ లేని లిప్ బామ్ అయితే మంచిది.
2. మరీ పొడిబారిన చర్మతత్వం ఉన్నవారిలో కూడా పెదాలు నల్లబడే సమస్య ఉంటుంది. ఇలాంటివారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అధ్బుత ఫలితాలు ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారు మరియు యాక్నె సమస్యలు ఉన్నవారు ఇది చేసినా ప్రయోజనం ఉండదు.
3. నిమ్మరసాన్ని పెదాల చుట్టూ నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లారి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనె కలిపి రాసినా ప్రయోజనం ఉంటుంది.
4. తాజాగా తీసిన కలబంద గుజ్జుని నల్లగా ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేస్తే నలుపును తగ్గిస్తుంది.
5. ఓట్స్ తో చేసిన మిశ్రమాన్ని పెదాలు చుట్టూ రాసి మునివేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేస్తే అక్కడున్న మృతకణాలు, నలుపు తగ్గుతుంది.
6. పెదాలు నల్లగా మారడంతోపాటు… ఎక్కువగా పొడిబారి పగులుతుంటే.. రాత్రిళ్లు నెయ్యి లేదా మీగడ రాసుకుని చూడండి. చాలా తక్కువ సమయంలో మృదువుగా మారతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u