Sudha Chandran:సుధా చంద్రన్ తెలుగులో నటించకపోవటానికి కారణం ఇదేనట
Sudha Chandran facts :సుధా చంద్రన్ తెలుగులో నటించకపోవటానికి కారణం ఇదేనట.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సుధా చంద్రన్. నాగిని సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు సుధా. అలాగే ఝరక్ దిఖ్లా జా, షాదీ కర్కే ఫాస్ గయే యార్ వంటి ధారవాహికలలో పనిచేశారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సుధా చంద్రన్ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు.
సుధా చంద్రన్ 1965 సెప్టెంబర్ 27న ముంబైలో జన్మించారు. ఆమె భారతనాట్య నృత్యకారిణి. 1981లో మద్రాసు నుంచి తన తల్లిదండ్రులతో కలిసి వస్తుండగా.. తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కాలికి గాయమైంది. దీంతో ఆమె కాలు గ్యాంగ్రీనస్ గా మారడంతో మోకాలి వరకు ఆమె కాలు తొలగించారు వైద్యులు.
దీంతో చిన్నప్పటి నుంచి నాట్యం పై ఉన్న మక్కువతో ఆమె నేర్చుకున్న భారత్య నాట్యానికి దూరమైంది. కానీ ఆమె ఆత్మ ధైర్యంతో ఎలాగైనా నృత్యం చేయాలనుకుంది. సింథటిక్ లెగ్‌తో తన నృత్య శిక్షణను కొనసాగించింది. భారతనాట్యంలో ఎన్నో అవార్డ్ అందుకున్నారు. ఆమె జీవితకథ ఆధారంగా వచ్చిన మయూరి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ మూవీ 1984లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత సుధా చంద్రన్ వెనుదిరిగి చూడలేదు.
నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన మయూరి మూవీలో నటించిన సుధాచంద్రన్ ఆ మూవీలో చేసిన నటనకు ఏకంగా ఆ మూవీకి 14నంది అవార్డులు వచ్చిపడ్డాయి. భారతీయ సినిమా చరిత్రలోనే ఈ మూవీకి ఓ విశిష్ట స్థానం ఉంది. 13వ సంవత్సరంలో ప్రమాదంలో కాలు పోగొట్టుకుని, కృతిమ కాలుతో డాన్స్ చేసి మెప్పించింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని తెరక్కించడంతో ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది. అశేష ప్రేక్షకాదరణ లభించింది.
ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఇండియాలో ప్రదర్శనకు నోచుకున్న మయూరి మూవీ తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిల్చింది. అయితే ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో విలన్ వేషాలు వేసింది. మయూరితో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సుధా తర్వాత ఎన్నో భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది.
సుధా చంద్రన్ మాట్లాడుతూ నిర్మాత రామోజీరావు మయూరి మూవీకి బ్లాంక్ చెక్ రాసిచ్చారని, ఇప్పటికీ తన బ్యాలెన్స్ తగ్గలేదని చెప్పింది. ఇక పొట్టకూటికోసమే విలన్ వేషాలు వేయాల్సి వచ్చిందని చెప్పింది. తనది ప్రేమ వివాహమని, ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పింది. సౌత్ ఇండియన్ కల్చర్ ఉండదని చెప్పారని, అయితే సౌత్ ఇండియన్ కల్చర్ లోపల ఉంటె, పంజాబీ లో అగ్రికల్చర్ ఉంటుందని తన భర్త చెప్పాడని ఆమె వివరించారు.
1992లో సీతా.. సల్మా.. సుజీ సినిమా సెట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ ను కలిశారు. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. వీరిద్దరు కొన్ని రోజులు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లి ఇరువురు కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో వారిని ఎదురించి వీరు చెంబూరులోని ఓ గుడిలో తమిళ ఆచారాల ప్రకారం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సుధా చంద్రన్ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u