Jaggery paratha:నోరూరించే తీపి బెల్లం పరాఠాలు ఇలా తేలికగా చేసుకోవచ్చు
Jaggery paratha Recipe:నోరూరించే తీపి బెల్లం పరాఠాలు ఇలా తేలికగా చేసుకోవచ్చు.. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని.. ఈ మధ్య కాలంలో బెల్లం వాడకం చాలా ఎక్కువ అయింది. బెల్లంతో స్వీట్ చేసుకుంటే చాలా మంచిది.
పిల్లల కోసం ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్ కాని,ఈవినింగ్ స్నాక్స్ గాని రుచిగా ఉండాలి,ఆరోగ్యకరంగాను ఉండాలి.అందుకే ఎంతో బలాన్నిచ్చే బెల్లం చపాతిలు చేసిపెట్టండి సరదాగా తినేస్తారు.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 2 కప్పులు
మజ్జిగ – 1 కప్పు
బెల్లం తురుము – ½ కప్పు
నెయ్యి – 2 టీ స్పూన్స్
ఉప్పు – చిటికెడు
తయారీ విధానం
1.మిక్సింగో బౌల్ లోకి గోధుమ పిండి వేసుకోని అందులోకి మజ్జిగ,ఉప్పు,నెయ్యి వేసి మెత్తగా కలుపుకోవాలి.
2.కలుపుకున్నన పిండి మూత పెట్టి పదినిమిషాలు పక్కనపెట్టుకోవాలి.
3.ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకోని చపాతిలా వత్తుకోవాలి దాని కరిగించిన నెయ్యి బెల్లం తురుము చల్లుకోవాలి.
4.ఇప్పుడు చపాతిని మడతపెట్టుకోని పొడిపిండి చల్లుకోని చపాతిలా తాల్చుకోవాలి.
5.స్టవ్ పై పెనం పెట్టుకోని వేడెక్కాక తయారు చేసుకున్న బెల్లం చపాతిని ప్యాన్ పై వేసుకోవాలి.
6.ఒక నిమిషం పాటు చపాతి కాల్చుకున్నాక బటర్ కాని,నెయ్యికాని రాసుకోవాలి.
7.ఇప్పుడు చపాతిని రెండో వైపు తిప్పు కోని ఎర్రగా కాల్చుకోవాలి.
8.అంతే కమ్మ కమ్మగా తియ్యగా తియ్యగా బెల్లం చపాతిలు రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ