చేతితో ఆహారాన్ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
Benefits of Eating Food With Your Hands In Telugu :ప్రాచీన కాలంలో ఆహారాన్ని చేతితో తీసుకునేవారు. కాల క్రమేనా ఈ అలవాలు మర్చిపోతున్నారు జనాలు. స్పూన్ తో ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే చేతితో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు బోజనం నేలపై కూర్చొని అరటి ఆకులో తీసుకునేవారు. చేతితో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట. అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట. వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.
చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది.
మన పురణాల పరంగా చూస్తే..చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట. బొటనవేలు : అగ్నితత్వం, చూపుడు వేలు : వాయుతత్వం, మధ్యవేలు : ఆకాశం, ఉంగరపు వేలు : భూమి, చిటికిన వేలు : జలతత్వం..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u