Kitchen Tips:మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు..అసలు మిస్ కావద్దు
Kitchen Tips:మహిళల కోసం ప్రత్యేక వంటింటి చిట్కాలు..అసలు మిస్ కావద్దు.. ప్రతి రోజు వంటింటిలో ఎన్నో రకాల పనులను చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు కొన్ని చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా వంటను పూర్తి చేయవచ్చు. ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
కూరగాయలను కట్ చేసినప్పుడు పసుపు కలిపిన నీటిలో వేస్తే…ఏమైనా క్రిములు ఉంటె పైకి తేలతాయి.
మైక్రో ఓవెన్ లో వాసన రాకుండా ఉండాలంటే…ఓవెన్ లో బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజ్ ముక్కను ఉంచాలి. ఇలా చేస్తే ఎటువంటి దుర్వాసన రాదు.
ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యంను నానబెడుతూ ఉంటాం. అలా నానబెట్టటానికి ముందు బియ్యాన్ని కొంచెం వేగిస్తే ఇడ్లీ, దోశల రుచి చాలా బాగుంటుంది.
ఎండాకాలంలో వడియాలు పెడుతూ ఉంటాం. మినప వడియాలు తెల్లగా రావాలంటే మినప రుబ్బులో నిమ్మరసం కలపాలి.
వేపుడు కూరల్లో ఓ చెంచా వెనిగర్ వేస్తే నూనె ఎక్కువగా పీల్చవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.