Oats Breakfast:బరువు తగ్గాలంటే కష్టపడే పని లేకుండా ఇలా ఇష్టంగా చేసుకుని తింటే చాలు
Oats Breakfast: ఈ రోజుల్లో డైట్ లో ఉన్నవాల్లంత ఎక్కువ శాతం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ నే తీసుకుంటున్నారు. ఓట్స్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ,డిఫరెంట్ టేస్ట్ లతో రెసిపీస్ రెడీ చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1 కప్పు
ఉల్లిపాయ – 1
క్యాప్సికం – 1
పచ్చిమిర్చి – 2
టమాటో – 1
పసుపు – 1 టీ స్పూన్
ఉప్పు – ¾ టీ స్పూన్
మిరియాల పొడి – ½ టీ స్పూన్
గుడ్డు – 1
కొత్తిమీర – 1 కప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక క్యాప్సికం ,పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి.
3.అవి వేగాక క్యారేట్ ,టమాటో ముక్కలు వేసిమెత్తపడే వరకు వేపుకోవాలి.
4.టమాట మెత్తపడ్డాక పసుపు,ఉప్పు,మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి.
5.అవసరం అనుకుంటే గుడ్డును యాడ్ చేసుకోవొచ్చు..లేదంటే స్కిప్ చెయ్యవచ్చు.
6.ఇప్పుడు వేగిన కూరగాయ ముక్కల్లోకి ఓట్స్ ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
7.ఓట్స్ ను కలుపూతు కాసేపు ఉడకనివ్వాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఓట్స్ రెసీపి రెడీ అయినట్టే.