Healthhealth tips in telugu

Lemon Grass Tea:1 కప్పు టీ తాగితే శరీరంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గి గుండె సమస్యలు రావు

Health benefits of lemongrass tea : లెమన్ గ్రాస్ టీ ని నిమ్మగడ్డితో తయారుచేస్తారు. నిమ్మ గడ్డి మొక్క అచ్చం గడ్డిలా పెరుగుతుంది. కానీ ఈ గడ్డి మాత్రం నిమ్మకాయ వాసనను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని నిమ్మ గడ్డి అని పిలుస్తారు. నిమ్మగడ్డితో తయారుచేసే లెమన్ గ్రాస్ టీని కాఫీ, టీలకు బదులుగా ఉదయాన్నే తీసుకుంటే షాకింగ్ ఫలితాలుంటాయి.

లెమన్‌ గ్రాస్.. దీనిని నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. ఇది నిమ్మ వాసన వస్తుంది. అయితే నిమ్మగడ్డితో తయారుచేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లెమన్‌ గ్రాస్ టీ తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో మలినాలు బయటకు పోతాయి. ఓకరకంగా డిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుంది.
Lemon Grass
జీవక్రియలను మెరుగుపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి అజీర్ణం,మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు లేకుండా చేయటమే కాకుండా అధిక బరువును తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. మహిళలు నిమ్మగడ్డి టీని తరచూ తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే సమస్యలు రావు.
Diabetes In Telugu
డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటి వాటిని తగ్గించి మానసికంగా ప్రశాంతత కలిగేలా చేస్తుంది. మంచి నిద్ర పట్టటానికి కూడా సహాయపడుతుంది. గొంతు సమస్యలు, దగ్గు, జలుబు, అలర్జీలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

వారంలో మూడు సార్లు తాగటానికి ప్రయత్నం చేయాలి. ఇది ఔషధ టీల జాబితాలోకే వస్తుంది. గ్రీన్ టీలాగే, లెమన్ గ్రాస్ వల్ల కూడా చాలా ఆరోగ్యం కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే సమస్యలను కూడా చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఈ టీని ఎలా తయారుచేయాలో చూద్దాం.
Lemon Grass Tea
ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం అందులో ఒక కప్పు లెమన్‌ గ్రాస్‌ కాడలను వేసి మళ్లీ 5 నుంచి 7 నిమిషాల పాటు నీటిని మరిగించాలి. ఆ తర్వాత స్టవ్‌ ఆర్పి టీని కిందకు దించి దాన్ని వడకట్టాలి. ఆ టీలో తేనె కలుపుకుని వేడిగా ఉండగానే తాగేయాలి. తేనె బదులు బెల్లం కూడా వాడవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె,బెల్లం లేకుండా తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.