Kitchenvantalu

Egg Curry:ధాబా స్టయిల్లో ఎగ్ మసాలా కర్రీ.. రైస్ రోటి బిర్యానీలోకి బెస్ట్ గ్రేవీ..

Egg Curry: ధాబా స్టయిల్లో ఎగ్ మసాలా కర్రీ.. రైస్ రోటి బిర్యానీలోకి బెస్ట్ గ్రేవీ..వారంలో రెండు మూడు సార్లైనా చేసుకునే ఎగ్ కర్రీ రోటీన్ గా చేస్తే బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు స్టైల్ మారిస్తే టేస్ట్ మార్తుంది.డిఫరెంట్ స్టైల్లో ఎగ్ రెసీపీ ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 4
ఉల్లిపాయలు – 3
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 182 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
కారం – 1 ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్ – ½ టీ స్పూన్
గరం మసాలా – చిటికెడు
కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక అందులోకి ఉప్పు,పచ్చిమిర్చి ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక పసుపు,కారం ,ధనియాల పొడి,జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి.
4. ఇప్పుడు అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కప్పు నీళ్లు పోసి నిమిషం పాటు ఉడకనివ్వాలి.

5. అది కాస్త దగ్గర పడ్డాక కర్రీని కడాయిలో ఒక వైపు గా నెట్టి గుడ్లను పగుల కొట్టి వేసుకోవాలి.
6.ఐదు నిమిషాల వరకు గుడ్లను కదిలించకుండా మూత పెట్టి ఉడకనివ్వాలి.
7.గుడ్లు ఉడికి గ్రేవి దగ్గర పడ్డాక అందులోకి గరంమసాలా ,కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ