Health Tips:స్ట్రాబెర్రీ+అరటిపండు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Benefits of banana and strawberry smoothie :స్ట్రాబెర్రీ+అరటిపండు కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా.. స్ట్రాబెర్రీ, అరటిపండు రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.
అరకప్పు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత బాగా పండిన అరటిపండును ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత మూడు ఖర్జూరాలను గింజలు తీసి ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను పోసి మరోసారి మిక్సీ చేసి తాగాలి.
ఈ విధంగా వారంలో మూడు సార్లు తాగుతూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉండి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ సమస్య, మతిమరుపు సమస్య అసలు ఉండవు. చదువుకొనే పిల్లలకు ఇస్తే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. శరీరంలో వ్యాధినిరోదక శక్తి పెరుగుతుంది.
నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి ఏమి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఫైబర్ మరియు పెక్టిన్ సమృద్దిగా ఉండుట వలన కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే పొటాషియం ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యం బాగుండేలా ప్రోత్సహిస్తుంది.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అలాగే ఫ్లేవనాయిడ్లు మరియు ఫైటోన్యూట్రియెంట్స్ వంటి సూక్ష్మపోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఇటువంటి smoothie లను వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ