Street Style Egg 65:స్పెషల్ టిప్స్ & సీక్రెట్స్ తో ఎగ్ 65 .. అందరికి నచ్చుతుంది
Street Style Egg 65:స్పెషల్ టిప్స్ & సీక్రెట్స్ తో ఎగ్ 65 .. అందరికి నచ్చుతుంది..ఎలా చేసినా ఎగ్ స్పెషల్స్ కి తిరుగేముంటుంది.ఫ్రై ,పులుసు,ఇగురు,కాకుండా ఎగ్ 65 ట్రై చేసి చూడండి.పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 4
ఉప్పు – కొద్దిగా
మైదా – 3 టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్
నీళ్లు – తగినన్ని
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
టాసింగ్ కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్
కరివేపాకు – 3 రెమ్మలు
వెల్లుల్లి – 1.5 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 2
గరం మసాలా – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
కారం – ¾ టీ స్పూన్
ఉప్పు – తగినంత
పెరుగు – 1 కప్పు
రెడ్ ఫుడ్ కలర్ – ½ టీ స్పూన్
అజినోమోటో – 1 టీ స్పూన్
కొత్తీమీర – కొద్దిగా
నిమ్మరసం – ½ టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.ఉడికించిన గుడ్లని నాలుగు సగాలుగా చీరుకోండి.
2.కోటింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్ని వేసి నీళ్లలో కలిపి బాగా కోట్ చేయాలి.
3.బీట్ చేసుకున్న పిండిలో గుడ్డు ముక్కలను వేసి నెమ్మదిగా కోటింగ్ చేసి మరిగే నూనెలో వేసిఎర్రగా వేపుకోవాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి వెల్లుల్లి , అల్లం,ఎండుమిర్చి, పచ్చిమిర్చి తరుగు వేసి వెల్లుల్లి రంగు మారే వరకు వేపుకోవాలి.
5.వెల్లుల్లి వేగాక ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి వేపుకోవాలి.
6.వేగిన కరివేపాకులో ఉప్పు,కారం ,గరం మసాలా,ధనియాల పొడి ,జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి.
7.వేగిన మసాలలలో చిలికిన పెరుగు వేసి లో ఫ్లేమ్ పై కలుపుతు చిక్క పడనివ్వాలి.
8.పెరుగు ఉడుకుతున్నప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అజినోమోటో వేసి కలుపుకోవాలి.
9.పెరుగు చిక్కపడ్డాక వేపుకున్న గుడ్లు వేసి నెమ్మదిగా హై ఫ్లేమ్ మీద టా స్ చేసుకోండి.
10.చివరగా నిమ్మరసం ,కొత్తిమీర చల్లుకోని సర్వ్ చేసుకోవడమే.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ