Eating Okra : ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
Lady Finger Benefits In Pregnancy : ప్రెగ్నెన్సీ లేదా గర్భధారణ సమయంలో ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తల్లి, బిడ్డ సరైన పోషకాలను పొందేందుకు.. ఆరోగ్యకరమైన ఆహారం(Healthy Food) తీసుకోవడం చాలా ముఖ్యం.
గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఈ రోజు గర్భధారణ సమయంలో Bendakaya తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
మనలో చాలా మంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ బెండకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెండకాయలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్, విటమిన్ లు సి,ఎ, ఇ,కె సమృద్దిగా ఉంటాయి.
బెండకాయ గర్భిణీ స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. శిశువు యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవసరమైన ఫోలేట్ మరియు రిబోఫ్లావిన్ అనేవి చాలా సమృద్దిగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఐరన్ శోషణలో సహాయపడుతుంది. అలాగే శిశువులో రోగనిరోధక శక్తిని మరియు చర్మం, జుట్టు మరియు ఎముకల అభివృద్ధిని మరింత ప్రోత్సహిస్తుంది.
ఫోలిక్ యాసిడ్ శిశువులలో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. శిశువులో నాడీ నాళాలు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాకుండా పిండం పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గుండె వ్యాధులు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కరిగే మరియు కరగని డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది.
సాదరణంగా గర్భధారణ సమయంలో మలబద్దకం సమస్య చాలా మందిలో కనపడుతుంది. బెండకాయలో ట్రిప్టోఫాన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండుట వలన నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది. బెండకాయను వారంలో రెండు సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిది. గర్భధారణ సమయంలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ