Protein shake:ఉదయం 1 గ్లాసు తాగితే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు
Homemade protein shake In Telugu :ఉదయం 1 గ్లాసు తాగితే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు.. ఈ మధ్య కాలంలో మనలో చాలామంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు నీరసం, అలసట, జీర్ణం వ్యవస్థలో సమస్యలు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం, కండరాల నొప్పులు, కిడ్నీ సమస్యలు, జుట్టు అధికంగా రాలిపోవటం వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మన శరీరంలో ప్రోటీన్ కొరత లేకుండా చూసుకోవాలి. మార్కెట్లో ప్రోటీన్ పౌడర్ లలో చాలా రకాలు లభ్యమవుతాయి. అయితే అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ప్రోటీన్ షేక్ తయారు చేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రోటీన్ షేక్ చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.
ఒక బౌల్ లో చిన్న కప్పు సోయాబీన్స్ వేసి నీటిని కోసం రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన సోయాబీన్స్ నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం నుండి సోయా పాలను సపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో మూడు స్పూన్ల ఓట్స్., ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ అవిసె గింజలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేయాలి.
ఆ తర్వాత ఐదు బాదం పప్పులు, ఒక స్పూన్ పీనట్ బట్టర్, గింజలు తీసిన రెండు ఖర్జూరాలు, పావు స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాసు సోయా పాలు వేసుకుని మిక్సీ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ప్రోటీన్ షేక్ సిద్ధం అవుతుంది. ఈ ప్రోటీన్ షేప్ ని ప్రతిరోజు ఉదయం తీసుకుంటే ఎముకలు, కండరాలు బలంగా మారటమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. .
ఈ ప్రోటీన్ షేక్ ని ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. కిడ్నీల పనితీరు మెరుగుపడి కిడ్నీలకు ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలసట., ఒత్తిడి వంటివి ఏమీ లేకుండా ఉంటాయి. ప్రోటీన్ లోపం అనేది లేకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి నియంత్రణలో ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్., కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ