Walnuts:డయబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ తింటే…ఈ తప్పులు అసలు చేయకండి
Walnuts For diabetes In telugu : డయబెటిస్ ఉన్నవారు వాల్ నట్స్ తింటే…ఈ తప్పులు అసలు చేయకండి..డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మనలో చాలా మంది ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకున్నారు. ఈ సీజన్ లో వాల్ నట్స్ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తింటే మంచిది.
వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్,కాపర్, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వాల్ నట్స్ జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల నానబెట్టి తింటే త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
వాల్‌నట్స్‌ను నానబెట్టి తింటే.. రక్తంలో చక్కెర స్థాయులు, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని, నానబెట్టిన వాల్‌నట్స్ శరీరంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ గా పనిచేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ సమస్యకు వాల్‌నట్స్ దివ్యౌషధంలా పని చేస్తుందని కొన్ని పరిశోదనల ద్వారా తెలిసింది.
డయాబెటిక్ ఉన్నవారు.. ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకుంటే, శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పెరుగుతుంది. ఇది శరీరంలో హై బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తాయి. నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల శరీరంలో.. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది. వాల్‌నట్స్‌లోని లక్షణాలు.. శరీరంలోని కణాలు ఇన్సులిన్ హార్మోన్ బాగా ఉపయోగించేలా సహాయపడతాయి.
మన శరీరంలో కణాలు ఇన్సులన్‌ను ఉపయోగించలేనప్పుడు.. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.
వాల్‌నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచే వేగాన్ని అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన వాల్ నట్స్ తింటే.. రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ ఉంటుంది.అలాగే వాల్‌నట్స్ తినేవారికి.. డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
వాల్ నట్స్ లో ఒమేగా ఫ్యాటీ-3 ఆమ్లాలతోపాటు పాలీఫినాల్స్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తాయి. అందువల్ల వీటిని తినటం వలన మెదడు ఆరోగ్యానికి సహాయపడి అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. నానబెట్టిన వాల్ నట్స్ తినటం వలన చెడు కొలెస్ట్రాల్ చాలా వేగంగా తగ్గుతుంది.
అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. రోజులో ఎన్ని వాల్ నట్స్ తింటే మంచిదో తెలుసుకుందాం. కప్పు నీటిలో 2 గింజల వాల్‌నట్స్ ను నానబెట్టి 5 గంటల తర్వాత మాత్రమే తినాలి. ఖాళీ కడుపుతో లేదా నిద్రవేళలో తింటే మంచిది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తింటే మంచి నిద్ర పడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ