Japa Mala: జపం ఎలా చేయాలి.. ఏ మాలతో ఎలాంటి ఫలితం ఉంటుంది.
Japa Mala:జపం.. ఇది సర్వశ్రేష్ఠం. భగవంతుని ఆరాధన వలన ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది. దాదాపు అన్ని మతాలలో, దండలు ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తారు. హిందూ ధర్మంలో దేవునికి ధరించే దండ నుండి వివిధ రకాలైన విత్తనాలతో కూడిన దండలు వారి జపం కోసం ఉపయోగిస్తారు.
దేవతామూర్తుల మంత్రోచ్ఛారణ సమయంలో ముత్యాలు, పగడాలు, శంఖం, పసుపు, వైజయంతి, రుద్రాక్ష మొదలైన వాటితో చేసిన దండలు మాత్రమే ఉపయోగిస్తారు. బొటానికల్ ఉత్పత్తులతో తయారు చేయబడిన జపమాలలు చౌకగా ఉంటాయి. జపానికి అందుబాటులో ఉంటాయి
ప్రతి ఒక్కరు జపం చేయటానికి ఏదొక మాలను ఉపయోగించటం చూస్తూనే ఉంటాం. జప మాలలతో చాలా రకాలు ఉంటాయి. అందువల్ల ఏ జప మాలతో జపం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.పాదరస గుళికలతో తయారుచేసిన జపమాలతో జపం చేస్తే అన్ని రకాల ఫలితాలు పొంది శక్తివంతులు అవుతారు.మాణిక్య మాలతో జపం చేసేవారు తాము కోరుకున్న వారితో వివాహం అవుతుంది.బంగారు మాలతో జపం చేసే వారు అష్ట ఐశ్వర్యాలు పొందుతారు.
ఇంద్ర నీల మణులతో కూడిన మాలతో జపం చేస్తే శత్రు భయం ఉండదు.పగడ మాలతో జపం చేస్తే వశీకరణ శక్తి వస్తుంది.ముత్యాల మాలతో జపం చేస్తే సమస్త శాస్త్రాలు నాలుక మీద తాండవం చేస్తాయి.స్వచ్ఛమైన స్పటిక మాలతో జపం చేయుట వలన మంచి గుణాలు కలిగిన సంతానం కలుగును.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ