Kitchen Hacks:పప్పుదినుసులకు పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి..
Kitchen Hacks:పప్పుదినుసులకు పురుగు పట్టకుండా ఉండాలంటే.. మనం ఒక్కోసారి బియ్యం,పప్పులు వంటి వాటిని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వానా కాలంలో కూడా పప్పులు,బియ్యం వంటి వాటికీ చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
పప్పులు,బియ్యం పోసే డబ్బాలో ఎండిన వేపాకులను వేస్తే పురుగు తొందరగా పట్టదు. అలాగే వెల్లుల్లి కూడా పురుగు పట్టకుండా నిరోదిస్తుంది. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేయాలి. ఈ రెండు చిట్కాలు బియ్యం,పప్పులు పురుగు పట్టకుండా చేస్తాయి. వేపాకులు,వెల్లుల్లి రెబ్బలను వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి.
అలాగే పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి. పప్పులు స్టోర్ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్ బ్యాగ్ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ