Ozempic:అసలు ఓజెంపిక్ ఏంటి? దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారా.. ఎంతవరకు నిజం..?
Ozempic:ఈ మధ్య ఒక influencers ద్వారా కానీ మనకి సోషల్ మీడియా వెబ్సైట్ లో కానీ చాలా కామన్ గా వినిపిస్తున్న పదం Ozempic. అసలు Ozempic అంటే ఏంటి.. ఎందుకు ఈ మధ్య జనాలు దీని వైపు మక్కువ చూపిస్తున్నారు.. వంటి విషయాలను వివరంగా senior consultatnt nutritionist Dt Swetha Gangadhari మాటల్లో..
నిజానికి ఈ ఓజంపిక్ అనేది చాలామంది వెయిట్ లాస్ కోసం వాడుతున్నారు. కానీ ఇది ప్రధానంగా టైప్ టు డయాబెటిస్ ని control చేసే మెడిసిన్ అనమాట. అయితే ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని కొన్ని రీసర్చ్స్ claim చేసిన మీదట టైప్ టు డయాబెటిస్ వాళ్ళ కంటే ఎక్కువ కూడా వెయిట్ లాస్ కోసం చాలా మంది ఈ ozempic వాడుతున్నారు.
అసలు ఇది షుగర్ కంట్రోల్ చేసే ప్రాసెస్ కాకుండా వెయిట్ తగ్గడానికి ఎలా హెల్ప్ అవుతుంది.. అనే విషయానికి వచ్చే సరికి ఇది మీ ఎపిటైట్ ని తగ్గిస్తుంది.. అంటే మీకు ఆకలి కోరికను తగ్గిస్తుంది.. అందువల్ల మీరు తక్కువ తింటారు.. దాంతో మీ గట్ intenstine ఫంక్షన్ ని స్లో చేస్తుంది. అంటే మీరు ఏ ఫుడ్ తిన్నా మెల్లిగా digest అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల మీకు ఎప్పుడూ పొట్ట ఫుల్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆకలి తొందరగా వెయ్యదు .
తర్వాత ఈ ఓజంపిక్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించవచ్చు. దీనివల్ల ఆటోమేటిక్గా శరీరంలో ఫ్యాట్ అనేది స్టోరేజ్ తక్కువ అవుతుంది.దీన్ని ఎందుకు అసలు మనము ఓన్లీ సోర్స్ ఆఫ్ వెయిట్ లాస్ గా చూడకూడదు అంటే మనకి ఫరెవర్ హెల్త్ బెనిఫిట్స్ అయితే కచ్చితంగా ఇవ్వదు. ఇది జస్ట్ ఫూలింగ్ యువర్ Tummy లాగా అంటే మన పొట్టని మనం ఒక చిన్నపాటి డైవర్షన్ క్రియేట్ చేయడం.. ఇది లాంగ్ టర్మ్ వరకు అస్సలు మంచిది కాదు.
ఇది ఇంకా Newly launched మెడిసిన్ కాబట్టి మనం పూర్తిగా డిపెండ్ అయి ఉండడానికి అయితే అస్సలు లేదు దీని మీద జరగాల్సినటువంటి పూర్తీ రీసర్చ్ అయ్యేంతవరకు కూడా ఒక కొలికి అనేది రాదు. అందువల్ల దీని మీద పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. ozempic తో బరువు తగ్గాలంటే దాన్ని తీసుకోవడమే కాకుండా మనము మంచి ఆహార అలవాట్లు వ్యాయామం మరియు మన లైఫ్ స్టైల్ ని కచ్చితంగా మార్చుకోవాలి.
అది ఒక్కటే బరువు తగ్గించేలా యూస్ chesi బరువు తగ్గితే మాత్రం కచ్చితంగా ఎప్పుడైతే మీరు ozempic మానేస్తారో ఈ ఆహారం వ్యాయామం జీవనశైలిలో కంట్రోల్ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ బరువు పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల మళ్లీ మీ హార్మోన్స్ మీద ఒత్తిడి, లివర్ మీద ఒత్తిడి, గాల్బ్లాడర్ మీద ఒత్తిడి లాంటివి చూస్తాం . దీనిలోని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం గమనించుకోవాలి.
అందరికీ పడదు కొంతమందికి అసౌకర్యంగా మారవచ్చు అంటే కొంతమందికి వాంతులు, చాతి నొప్పి, చాతిలో మంట, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గా స్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తంగా క్వాలిఫైడ్ nutritionist గా నేను చెప్పేది ఏంటి అంటే Ozempic అనేది ఓన్లీ వెయిట్ లాస్ కి మాత్రం అస్సలు యూస్ చేయకండి. ఒకవేళ యూస్ చేసిన కూడా మీ లైఫ్ స్టైల్, హెల్తి ఫుడ్, ఎక్ససైజ్, స్లీప్ స్ట్రెస్ కచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి.
ఇవి కంట్రోల్లో లేకపోతే Ozempic మానేసిన వెంటనే కచ్చితంగా మళ్ళీ బరువు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరియు ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి ఒక రకంగా హెల్ప్ ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్లకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం షుగర్ వ్యాధికి సంబంధించిన ప్రాబ్లం లో Ozempic ని యూస్ చేయవచ్చు.
కానీ దాని మీదే ఆధారపడి ఉండకుండా షుగర్ ని కూడా మీ మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం, స్ట్రెస్ మేనేజ్మెంట్, నిద్ర, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని తగ్గించుకుంటే అదే శ్రేయస్కరం. దీనిలో మీకు ఉన్న అనుమానాలను Dt Swetha Gangadhari తో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.
Dt Swetha Gangadhari
+91 98662 38365
https://flexcellence.co/