Cool Drinks in Summer: వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త..!
Cool Drinks in Summer: వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా? జాగ్రత్త.. వేసవి కాలంలో చల్లదనాన్ని కోరుకుని మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌ను ఆనందంగా తాగేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి.ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని ముప్పు తీసుకొస్తున్నామన్న విషయాన్ని గుర్తించాలి.
వేసవి కాలం వచ్చేసింది. ఈ వేసవిలో విపరీతమైన ఎండల కారణంగా బయటకు వెళ్ళితే వడదెబ్బ తగలటం ఖాయం. అందువల్ల చాలా మంది ఇంటిలో నుంచి బయటకు రావటం లేదు. అయితే కొంత మంది మాత్రం పనుల కారణంగా బయటకు రావాల్సి వస్తుంది. అలాంటి వారు విపరీతమైన ఎండ కారణంగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగేస్తూ ఉంటారు.
వేసవిలో కూల్ డ్రింక్స్ త్రాగితే తక్షణ శక్తి,దాహం తీరుతుందని అందరూ భావిస్తారు. కానీ ఇలా ఎక్కువగా కూల్ డ్రింక్స్ త్రాగటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగటం వలన వాటిలో ఉండే చక్కర కంటెంట్ కారణంగా బరువు ఎక్కువగా పెరుగుతారు.
కూల్ డ్రింక్ లో దాదాపుగా 15 స్పూన్స్ పంచదార ఉంటుంది. సాధారణంగా ఇంత పంచదార తింటే వాంతులు అవుతాయి. కానీ కూల్ డ్రింక్స్ తయారుచేసేటప్పుడు ఫోస్పరిక్ ఆమ్లం కలుపుతారు. అందువల్ల కూల్ డ్రింక్స్ లో పంచదార ఎక్కువైనా వాంతులు రావు. దీని వల్ల పంచదార కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది.
కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. కూల్ డ్రింక్స్ లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకొనే ఒక కప్పు కాఫీలో ఉండే కెఫీన్ కన్నా పది రేట్లు కెఫీన్ కూల్ డ్రింక్స్ లో ఉంటుంది.
కెఫీన్ కారణంగా శరీరంలో ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. గుండె కొట్టుకొనే తీరులో మార్పులు,రక్తపోటు పెరగటం, కొన్ని సందర్భాలలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాక కిడ్నీలపై కూడా విపరీతమైన భారం పడుతుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్స్, చక్కెర పంటి మీద ఎనామిల్ మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి.
కూల్ డ్రింక్ లో ఉండే రసాయనాల వల్ల ఎముకలు సాంద్రత తగ్గిపోయి ఎముకలు త్వరగా బలహీనం అవుతాయి. కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి, డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. వీటిలో వుండే కేఫైన్, షుగర్, డీ హైడ్రేషన్ కలిగిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ