Beauty TipsHealth

Skin Care With Banana : అరటిపండుతో అందం.. వారానికోసారి ఇలా చేస్తే చాలు..

Skin Care With Banana:అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందరూ మీ వైపు చూడాలని మనసులో అనుకుని ఉంటారు కదా. మరి అలా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే.. చాలు. మీ స్కిన్ చూసి వావ్ అంటారు. అరటిపండు కూడా ఉపయోగిస్తే.. అందానికి ఎంతో మేలు.

ఆటలో అరటి పండు అని దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాము. కానీ దాన్ని అంత తేలిగ్గా తీసి వేయలేము. ఎందుకంటే ముఖ సౌందర్యం, చర్మ ఆరోగ్యం కొరకు అరటి పండు ఒక మంచి సాదనం అని చెప్పవచ్చు.

* బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్స్ గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖానికి,మెడకు బాగా పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది.

* అరటి పండు గుజ్జులో ఒక స్పూన్ పాలు లేదా తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 20 నుంచి 25 రోజుల పాటు చేస్తే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

* పొడి చర్మం కలవారు అరటి పండు గుజ్జులో గుడ్డు తెల్ల సోన,ఒక స్పూన్ క్రీం వేసి కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

* ముఖం మీద మచ్చలతో బాధపడేవారు అరటి పండు తొక్కతో మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్ది ఒక పావుగంట సేపు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడగాలి. రోజు మొత్తం మీద వీలు అయినన్నిసార్లు ఈ విధంగా చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.

* దంతాలు పసుపు పచ్చగా మారితే,అరటి తొక్కతో మీ దంతాల మీద బాగా రుద్దాలి. రోజులో కనీసం రెండు సార్లు చేసినట్లైతే మంచి పలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ