Healthhealth tips in telugu

Summer Fruits: వేసవిలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లు ఇవే… మీరు తింటున్నారా..

Summer Fruits:వేసవికాలంలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వేసవిలో చాల తొందరగా అలసట వచ్చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం రాగానే చాలామంది త్వరగా అలసిపోతారు. శరీరంలోని నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమస్యను తీర్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారమేంటో ఇప్పుడుచూద్దాం..

ఈ సీజన్‌లో ముంజలు ఎక్కువగా వస్తాయి. సిటీల్లోనూ అక్కడక్కడ ముంజలు అమ్మడం కనిపిస్తూనే ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాదు.. ఒంటికి కావాల్సిన నీటిశాతాన్ని ఈ ముంజలు అందిస్తాయి. వీటిలోని పీచుపదార్థాలు మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. కాల్షియం, ఇనుము, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియంలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తుంది

కీరదోస : నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని అలానే గానీ, సలాడ్, పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

ద్రాక్ష : ఎండాకాలంలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది. వాటిని తిరిగి పొందాలంటే ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు గల ద్రాక్షలను తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్లుకూడా దరిచేరవు.

పుచ్చకాయ : దాదాపు 80శాతం నీరు ఉండే పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలామంచిది. వీటిని తినడం వల్ల ఇందులోని విటమిన్ ఎ ఆరోగ్యానికి మేలు చేయడమే కాక.. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల ఎఫెక్ట్ అంతగా పడవు.

పచ్చిమామిడి : ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే మామిడికాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గడమే కాక వడదెబ్బకి చక్కని పరిష్కారం. మామిడి ముక్కలను నీటిలో కలిపి అందులోచక్కెర వేసి బాగా కలపాలి. వాటిని తాగడం వల్ల వడదెబ్బ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఈ ముక్కలను ఉప్పు చల్లి తినడం వల్ల దాహార్తి తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel: https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.

https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."