Kadai Paneer Recipe : రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్.. ఇంట్లోనే తయారు చేసేయచ్చు.. చాలా సులభంగా..
Kadai Paneer Recipe : రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్.. ఇంట్లోనే తయారు చేసేయచ్చు.. చాలా సులభంగా..రెస్టారెంట్లకు వెళితే షాహీ పనీర్, పనీర్ బటర్ మసాలా, పనీర్ టిక్కా, పనీర్ చిల్లీ ఇలా రకరకాల పనీర్ వంటకాలను ఆర్డర్ పెట్టి మరీ తింటూ ఉంటాం. హోటళ్లలో దొరికే కడాయి పనీర్ వంటకం చాలా రుచిగా అనిపిస్తుంది. దీన్ని ఇంట్లోనే తయారు చేయడం కూడా చాలా ఈజీ. కేవలం అరగంటలో తయారు చేసేయెుచ్చు.
కావాల్సిన పదార్థాలు
– పన్నీర్ – 200 గ్రాములు
– క్యాప్సికమ్ – 1 (సన్నగా తరిగినది)
– ఉల్లిపాయ – 1 (తరిగినది)
– టొమాటో ప్యూరీ – 1 కప్పు
– క్రీమ్ – 1 టేబుల్ స్పూన్
– కొత్తిమీర – అలంకరణకు కొద్దిగా
– అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1/2 టీస్పూన్
– నల్ల మిరియాలు – 1 టేబుల్ స్పూన్
– ఫ్లేక్స్ – 1 చిన్న ముక్క
– లవంగాలు – 2
– జీలకర్ర – 1/2 టీస్పూన్
– పసుపు – 1/4 టీస్పూన్
– ధనియాలు – 1 టీస్పూన్
– గరం మసాలా – 1/2 టీస్పూన్
– ఉప్పు – రుచికి సరిపడా
– వెన్న – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ఒక మూకుడులో నల్ల మిరియాలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు వేసి మీడియం మంటపై వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక మూకుడులో 1 టేబుల్ స్పూన్ వెన్న వేసి, పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి, ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే బాణలిలో మరికొంత వెన్న వేసి, కట్ చేసిన ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసి, 2 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, గ్రైండ్ చేసిన మసాలా వేసి బాగా కలపాలి. అవసరమైనంత నీరు పోసి, మరో 2 నిమిషాలు ఉడికించాలి.
ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా, వేయించిన పన్నీర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. గ్రేవీ కొద్దిగా దగ్గరవ్వగానే క్రీమ్ వేసి, తక్కువ మంటపై 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి, రుచికరమైన కడాయి పన్నీర్ మసాలాను సర్వ్ చేయండి. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ సెలవుల్లో పిల్లలకు చేస్తే చాలా ఇష్టంగా తింటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

