Healthhealth tips in teluguKitchen

ఎముకలు ఉక్కులా మారాలంటే ఈ స్పెషల్ ఇడ్లీ తినాల్సిందే! షుగర్ ఉన్నవారికి ఇది ఒక వరం!

Korrala Idli Health Benefits :”చాలామందికి తెలియని ఈ ఆరోగ్య రహస్యం మీ కోసం! సాధారణ బియ్యం ఇడ్లీ కంటే ‘కొర్రల ఇడ్లీ’ (Korralu Idli) లో పోషకాలు రెట్టింపు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ కొరతతో బాధపడేవారికి, నరాల బలహీనత ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణమే అందిస్తుంది. అసలు ఈ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలి? వారానికి రెండు సార్లు తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన మార్పులేంటో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి…”

కొర్రలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరు ధాన్యాల మీద అవగాహన పెరిగి కొర్రలు, సామలు వంటి వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని కొర్రలలో సమృద్ధిగా ఉంటాయి.
korralu
కొర్రలతో ఇడ్లీ తయారు చేసుకుని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. కొర్రలతో చేసిన ఇడ్లీలో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక బౌల్ లో అరకప్పు అటుకులు, ఒక కప్పు కొర్రలు, అర కప్పు పొట్టు తీయని మినప్పప్పు వేసి నీటిని పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి.

ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పిండిగా రుబ్బాలి. ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. ఇలా వదిలేయడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి పిండిని పులిసేలా చేస్తుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ మీగడ వేయాలి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అరకప్పు కొబ్బరి తురుము, ఒక స్పూన్ దంచిన మిరియాల పొడి, 1/4 స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి.
talimpu
ఒక నిమిషం వేగాక ఈ కొబ్బరి తాలింపును పైన తయారు చేసుకున్న కొర్రల పిండిలో వేసి బాగా కలపాలి. ఈ పిండిని ఇడ్లీలుగా వేసుకొని తినాలి. ఈ విధంగా ఇడ్లీలు వారంలో రెండు సార్లు చేసుకొని తింటూ ఉంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. అలాగే పిల్లల్లో మేధాశక్తి తెలివితేటలు పెరుగుతాయి.
Korralu Benefits In Telugu

అలసట,నీరసం, నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ ఇడ్లీలను తినవచ్చు. మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కొర్రలు కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి ఆహారాలను తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."