రోజుకి 4 బాదం పప్పులు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్ నిజాలు!
ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరికి ప్రతి రోజు డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే వాటిల్లో బాదంపప్పు కూడా ఒకటి. ప్రతిరోజు నాలుగు బాదం పప్పులను తింటే ఎన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈరోజు తెలుసుకుందాం.
ప్రతిరోజు నాలుగు బాదం పప్పులను నానబెట్టి పై తొక్క తీసి తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు చెప్పే విషయాలు తెలుసుకుంటే బాదంపప్పు తినని వారు కూడా తినటం అలవాటు చేసుకుంటారు
బాదంపప్పులో విటమిన్ ఈ, పీచు పదార్థాలు, కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు,మాంసకృతులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, మినరల్స్, విటమిన్స్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి

ప్రతిరోజు బాదం పప్పులను తినటం వలన శరీరానికి అవసరమైన మంచి కొవ్వు అందుతుంది. అలాగే శరీరానికి హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. బాదంలో మెగ్నీషియం,పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పోషకాలలోపం ఉంటే కనుక కిల్లా నొప్పులు, ఆస్టియో ఫ్లోరోసిస్ వాటి సమస్యలు వస్తాయి .
అందువల్ల రోజులో నాలుగు బాదం పప్పులు తినటం చాలా మంచిది. బాదంపప్పులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన యంటి ఆక్సిడెంట్ గా పనిచేసి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే విటమిన్ డి మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన బాదంపప్పును అనేక రకాల కాస్మోటిక్ తయారీలో వాడుతున్నారు

శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే కనుక జుట్టు రాలిపోతుంది. కాబట్టి బాదం పప్పులను తినడం వల్ల బాదం లో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
బాదంపప్పులను భోజనం చేయడానికి ముందు తింటే బాదం లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉండేలా చేసి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు.
గర్భధారణ సమయంలో కూడా బాదం చాలా మంచిది. బాధలో పోలిక్ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
సాధారణంగా గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య వస్తుంది. ఆ సమస్య రాకుండా బాదంపప్పులో ఉండే పైబర సహాయపడుతుంది. అయితే బాదం తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగడం వలన జీర్ణక్రియ రేటు బాగా పెరిగి పేగు కదలికలు బాగా జరిగి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
బాదంపప్పులో పొటాషియం ఎక్కువగాను సోడియం తక్కువగాను ఉండటం వలన రక్తపోటు సమస్య కూడా ఉండదు. రక్తప్రసరణ బాగా సాగుతుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. డయాబెటిస్ తో బాధపడేవారు భోజనం తర్వాత బాదం తింటే మంచి ప్రయోజనం కనపడుతుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది. దాంతో అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

