Healthhealth tips in telugu

“రోజూ రాత్రి జీడిపప్పు పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? నమ్మడం కష్టమే!”

జీడిపప్పులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పును మితంగా తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. మనలో చాలామంది జీడిపప్పును అలా తినేస్తూ ఉంటారు. అలా కాకుండా జీడిపప్పు పాలను తయారు చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

జీడిపప్పులో ప్రోటీన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, జింక్, పాస్పరస్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి.

ఒక బౌల్లో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేసి కొంచెం పాలు పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి. నాలుగు గంటలు తరువాత పాలల్లో నానిన జీడిపప్పును మెత్తని పేస్ట్ గా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి.

పోయి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి దానిలో తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆర్గానిక్ బెల్లం వేసి ఒక నిమిషం మరిగించిగ్లాసులో పోసి రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి.

అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం బెల్లం లేకుండా తీసుకోవాలి. ఈ పాలను రాత్రి సమయంలో తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ పాలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సరైన నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తాయి. అందుకే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే సమస్యలు దూరం అవుతాయి.

అలాగే జీడిపప్పు పాలని తీసుకోవడం వలన శారీరక అలసట, బలహీనత వంటివి ఏమీ ఉండవు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో శక్తి నిర్వహణకు కూడా సహాయపడుతుంది.

యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజన్లుగా వచ్చే వ్యాధులను రాకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా రాత్రి పడుకోవడానికి ముందు తాగటం అలవాటు చేసుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."