Kitchenvantalu

ఐరన్ బాక్స్ కింద నల్లటి జిడ్డు పేరుకుపోయిందా? కేవలం 2 నిమిషాల్లో క్లీన్ చేసే సూపర్ ట్రిక్ ఇదే!

Iron Box Tips:ఉతికిన బట్టలను శుభ్రంగా ఇస్త్రీ చేయాలని ఐరన్ బాక్స్ ఆన్ చేసి ఇస్త్రీ చేయడం ప్రారంభించగానే దానికి ఉన్న నల్లని మరకలు.జిడ్డు బట్టలకు అంటుకొని బట్టలు పాడైపోతున్నాయా.. ఎంత రుద్దిన ఆ ఇస్త్రీ box కింద ఉన్న నల్లని మరకలు పోవడం లేదా..

ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం కెమికల్స్ కొన్ని డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉండే ఒకే ఒక రూపాయి టాబ్లెట్ తో ఐరన్ బాక్స్ ను కేవలం రెండే రెండు నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించవచ్చు.

ఈ చిట్కా కోసం ఒక పారాసిటమల్ టాబ్లెట్ సరిపోతుంది. ఈ టాబ్లెట్ ఐరన్ బాక్స్ జిడ్డు, నల్లని మరకలను తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

ఐరన్ బాక్స్ ను ప్లగ్గుకు కనెక్ట్ చేసి కొంచెం వేడి చేయాలి. వేడి ఎక్కువ ఉండకూడదు. మీడియం గా ఉంటే సరిపోతుంది. ఐరన్ బాక్స్ కొంచెం వేడి అయ్యాక స్విచ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుని ఐరన్ బాక్స్ కింద నల్లగా ఉన్న ప్రాంతం పై రుద్దాలి. టాబ్లెట్ వేడికి కరుగుతూ అక్కడ ఉన్న నల్లని మచ్చలను, జిడ్డును తొలగిస్తుంది. నల్లని మచ్చలు జిడ్డు తొలగిపోయిన తరువాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఐరన్ బాక్స్ కింద శుభ్రంగా తుడిస్తే సరిపోతుంది.

ఒకవేళ మీకు పారాసిటమాల్ టాబ్లెట్ అందుబాటులో లేకపోతే తెల్లని కోల్గేట్ పేస్టు తో కూడా శుభ్రం చేయవచ్చు. అలాగే వంట సోడా నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి కూడా శుభ్రం చేస్తే జిడ్డు, నలుపు రంగు మరకలు తొలగిపోతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."