Healthhealth tips in telugu

బొప్పాయి+దానిమ్మ కాంబినేషన్.. ఈ రెండు పండ్లు కలిపి తీసుకుంటే జరిగేది ఇదే.. నిజంగా నమ్మలేరు!

ప్రస్తుతం మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని పోషకాలు మనకు అవసరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాయామం చేయకపోవడం, సరైన పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

సమస్య రాకుండా ఉండాలన్న సమస్య వచ్చినప్పుడు తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహారాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది.

ప్రతిరోజు డైట్ లో తప్పనిసరిగా పండ్లు ఉండేలా చూసుకోవాలి. మనలో కొంతమంది ఫ్రూట్స్ తినటానికి ఇష్టపడరు. కానీ ఫ్రూట్స్ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఈరోజు మనం బొప్పాయి, దానిమ్మ రెండు కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫ్రూట్ విడిగా తినటం కన్నా రెండు ఫ్రూట్స్ కలిపి తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ, బొప్పాయి రెండింటిలోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముందుగా దానిమ్మ తొక్క తీసి గింజలను విడదీయాలి.

ఒక చిన్న క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ జార్ లో దానిమ్మ గింజలు, క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బొప్పాయి ముక్కలు, పావు స్పూన్ పసుపు, ఒక గ్లాసు నీటిని పోసి గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకుని దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తీసుకుంటూ ఉంటే ఈ జ్యూస్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది ఎన్నో అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ఉపసమనం కలుగుతుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సమస్య సెట్ అవుతుంది.

గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి మొటిమలు, నల్లని మచ్చలు, ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
Carrot
అలాగే Hair సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన శరీరం వైపు చూడకుండా కాపాడుతుంది.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.ఈ జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ జ్యూస్ తాగవచ్చు. ఏటువంటి అనుమానం లేకుండా ఈ జ్యూస్ తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."