గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? ఈ ఒక్క డ్రింక్ తో 5 నిమిషాల్లో రిలీఫ్!
నమస్తే అండీ! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, సమయానికి భోజనం చేయకపోవడం, బయటి జంక్ ఫుడ్ తినడం, ఒత్తిడి.. వెరసి చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ‘గ్యాస్ మరియు ఎసిడిటీ’.
ఏదైనా కాస్త ఘాటుగా తిన్నా, లేదా టైమ్ కి తినకపోయినా కడుపు ఉబ్బరంగా మారిపోయి విపరీతమైన మంట మొదలవుతుంది.అయితే, ఈ గ్యాస్ సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు.

దీన్ని ఇలాగే వదిలేస్తే అల్సర్లు లాంటి పెద్ద సమస్యలకు దారితీస్తుంది. అలాగని ప్రతిదానికీ టాబ్లెట్లు మింగాల్సిన పనిలేదు. మన వంటగదిలో ఉండే పోపుల పెట్టెలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం!
గ్యాస్ కు చెక్ పెట్టే మ్యాజిక్ డ్రింక్ తయారీ విధానం: దీని తయారీ చాలా అంటే చాలా సులువు. కాస్త ఓపిక చేసుకుంటే చాలు:
ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకోండి.
అందులో చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు (సైంధవ లవణం అయితే ఇంకా మంచిది) వేయండి.
దానికి ఒక స్పూన్ నిమ్మరసం జత చేయండి.
ఇప్పుడు ఒక మూడు లవంగాలను కచ్చాపచ్చాగా దంచి ఆ నీటిలో వేసేయండి.

ఇలా అన్ని వేశాక గ్లాసుపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.
పది నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టుకుని తాగడమే!
ఎప్పుడు తాగాలి?
ఈ మ్యాజిక్ డ్రింక్ ను మీరు రోజులో ఎప్పుడైనా తాగొచ్చు. ముఖ్యంగా ఉదయం పూట కానీ, లేదా సాయంత్రం సమయంలో కానీ తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

ఈ డ్రింక్ తో కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు!
5 నిమిషాల్లో రిలీఫ్: విపరీతమైన గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు ఈ నీళ్లు తాగితే.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో మీ కడుపుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.
ఎసిడిటీ మాయం: కడుపులో మంట తగ్గిపోయి, జీర్ణవ్యవస్థ ట్రాక్ లో పడుతుంది.
ఆకలి పుడుతుంది: గ్యాస్ వల్ల ఏమీ తినాలనిపించదు కదా! ఈ డ్రింక్ తాగితే గ్యాస్ పోవడమే కాకుండా, మంచి ఆకలి పుడుతుంది.

రోగనిరోధక శక్తికి బూస్ట్: ఇందులో వాడిన లవంగాలు, నిమ్మరసం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ (Immunity) పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
ఇంకెందుకు ఆలస్యం.. మీకు లేదా మీ ఇంట్లో వాళ్లకు గ్యాస్, ఎసిడిటీ సమస్య వచ్చినప్పుడు వెంటనే ఈ సింపుల్ చిట్కాను ట్రై చేయండి. హాయిగా ఉండండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

