డ్రై ఫ్రూట్స్ తినేముందు ఎన్ని గంటలు నానబెట్టాలో మీకు తెలుసా?
హలో అండీ! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా పెరిగింది కదా. రోజంతా హుషారుగా ఉండటానికి, శరీరానికి కావాల్సిన పోషకాలు అందడానికి చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) తినడం అలవాటు చేసుకున్నారు.

అయితే, వీటిని నేరుగా తినేయకూడదు.. కచ్చితంగా నానబెట్టే తినాలి!కానీ, అసలు సమస్య ఏంటంటే.. ఏ నట్స్ ఎన్ని గంటలు నానబెట్టాలి? చన్నీళ్లలో నానబెట్టాలా లేదా వేడి నీళ్లలోనా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం!

ఎందుకు నానబెట్టాలి? వేడి నీళ్లే ఎందుకు బెస్ట్?
డ్రై ఫ్రూట్స్ ను చల్లని నీటికన్నా.. గోరువెచ్చని నీటిలో నానబెడితే వాటి పొట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది. ఆ నీటిలో కాస్త ఉప్పు వేస్తే.. నట్స్ లో ఉండే ఎంజైమ్ లు తటస్థీకరించబడతాయి (Neutralize). దానివల్ల వాటికి అంటుకుని ఉన్న దుమ్ము, ధూళి, హానికరమైన అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.

ముఖ్యంగా వాల్ నట్స్ లాంటి వాటిలో ‘ఫైటిక్ రసాయనాలు’ ఉంటాయి. వీటిని నానబెట్టకుండా నేరుగా తింటే జీర్ణం అవ్వడం చాలా కష్టం. నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, నట్స్ లోని 100 శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని గంటలు నానబెట్టాలంటే..
నట్స్ గట్టితనం, వాటి స్వభావాన్ని బట్టి నానబెట్టే సమయం మారుతుంటుంది. ఆ లిస్ట్ ఏంటో ఇక్కడ చూసేయండి:
బాదం పప్పు (Almonds): 12 గంటలు
వాల్ నట్స్ (Walnuts): 8 గంటలు
బ్రోకలీ గింజలు (Broccoli Seeds): 8 గంటలు
శనగలు (Chickpeas): 8 గంటలు
గుమ్మడి గింజలు (Pumpkin Seeds): 7 గంటలు
వేరుశనగ గింజలు (Peanuts): 7 గంటలు
జీడిపప్పు (Cashews): 6 గంటలు
అవిసె గింజలు (Flax Seeds): 6 గంటలు

ఇవి కూడా చదవండి:
చూశారుగా! ఇకపై డ్రై ఫ్రూట్స్ తినే ముందు వాటిని కరెక్ట్ టైమ్ కు నానబెట్టి తినండి. తద్వారా వాటిలోని పూర్తి పోషకాలను మీ సొంతం చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

