Kitchenvantalu

Aloo Matar kurma:రెస్టారెంట్ స్టైల్ ‘ఆలూ బఠాణీ కుర్మా’.. చపాతీ, పూరీల్లోకి రుచి అదిరిపోతుంది!

Aloo Matar Curry:ఆలు మటర్ మసాలా కర్రీ..గ్రేవి కర్రీస్ లోకి బంగాళదుంపలు సూపర్ గా సెట్ అవుతాయి.ఆలు ,కాసిన్ని బఠానీ కలిపి మసాలా కర్రీ చేసారంటే రుచి అదిరిపోతుంది.

పూరీ, చపాతీ, బగారా రైస్.. ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ ‘ఆలూ బఠాణీ కుర్మా’. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా ఏదైనా స్పెషల్ గా, కమ్మగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ఈ కుర్మా చేసి చూడండి.

అచ్చం దాబా/రెస్టారెంట్ రుచిని తలపించేలా.. గ్రేవీ చిక్కగా రావాలంటే ఈ ఆలూ బఠాణీ కుర్మాను సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!

కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంపలు – 1 కప్పు
ఉల్లిపాయలు – ½ కప్పు
పచ్చిమిమర్చి – 2
నూనె – 2 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
బఠానీలు – 1 కప్పు
టమాటో పేస్ట్ -1 కప్పు
కారం – 1 టీ స్పూన్

ఉప్పు – తగినంత
ధనియాల పొడి – 1 టీ స్పూన్
కొబ్బరి పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి -1/2 టీ స్పూన్
గరంమసాలా – ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పసుపు,బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూతపెట్టుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి బఠానీలు మూత వేసి ఉడికించుకోవాలి.

4.ముందుగా సిధ్దం చేసుకున్న టమాటో పేస్ట్ వేసి కలిపి కారం,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్రపొడి,కొబ్బరి పొడి, రెండు కప్పుల నీళ్లను వేసి మూత వేసి ఉడికించుకోవాలి.
5.చివరగా గరం మసాలా,కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.అంతే ఆలు మటర్ మసాలా కర్రీ రెడీ.

కుర్మా మరింత రుచిగా రావడానికి చిన్న టిప్:
గ్రేవీ మరింత చిక్కగా, కమ్మగా రావాలంటే.. ఉడికించిన ఒక బంగాళదుంపను లేదా కొద్దిగా జీడిపప్పును మెత్తగా పేస్ట్ చేసి ఉడుకుతున్న కుర్మాలో కలపండి. రుచి రెట్టింపు అవుతుంది!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."